హోమ్ /వార్తలు /సినిమా /

సెక్స్ రాకెట్‌లో దొరబాబు బలి పశువు అయ్యాడా.. తప్పించుకున్న పెద్దలు..

సెక్స్ రాకెట్‌లో దొరబాబు బలి పశువు అయ్యాడా.. తప్పించుకున్న పెద్దలు..

జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)

జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)

Dorababu | సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయిన దొరబాబు.. ఈ కేసులో బలి పశువు అయ్యాడా ? ఇందులో పెద్దలను విడిచిపెట్టి పోలీసులు దొరబాబును కావాలనే ఈ కేసులో ఇరికించారా అంటే ఔననే అంటున్నాయి స్మాల్ స్క్రీన్ వర్గాలు. 

సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయిన దొరబాబు.. ఈ కేసులో బలి పశువు అయ్యాడా ? ఇందులో పెద్దలను విడిచిపెట్టి పోలీసులు దొరబాబును కావాలనే ఈ కేసులో ఇరికించారా అంటే ఔననే అంటున్నాయి స్మాల్ స్క్రీన్ వర్గాలు. జబర్ధస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడటం టీవీ వర్గాల్లో పెద్ద సంచలనే అయింది. ఇదిలా ఉంటే దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి అసలేం జరిగిందింటే.. ఆ రోజు పోలీసులు పేకాట ఆడుతున్న బ్యాచ్ పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసులకు దొరికిపోయాడు. కానీ పోలీసులు అక్కడ పేకాట ఆడుతున్న పెద్ద మనుషులకు విడిచి పెట్టి.. మీడియా వాళ్ల నుంచి ఈ కేసు దృష్టిని మరల్చడానికి దొరబాబును ఈ కేసులో ఇరికించారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ సెక్స్ రాకెట్‌లో మొత్తంగా చూసుకుంటే దొరబాబు బలి పశువుగా మారాడని అంటున్నారు. ఈ కేసులో వేరే నటులు, పొలిటికల్‌ అండ ఉన్న వాళ్ల ప్రమేయం ఉన్నా... కావాలనే దొరబాబును అడ్డంగా బుక్ చేసారని చెబుతున్నారు. దొరబాబుపై ఇన్ని ఆరోపణలు వచ్చినా.. ఆయన భార్య.. జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ మాత్రం అతనికి అండగా నిలుస్తున్నారు. అతను అలాంటి వాడు కాడని చెబుతున్నారు.  మొత్తానికి ఈ వ్యవహారంలో నిజంగానే దొరబాబు దోషినా.. ? లేకపోతే వేరే వాళ్లు  పన్నిన  ట్రాప్‌లో పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు