Home /News /movies /

JABARDASTH COMEDIAN DORABABU REMEMBERED SEX RACKET ISSUE AND PRAISED HIS WIFE AMULYA FOR SUPPORT PK

Jabardasth: సెక్స్ రాకెట్‌పై జబర్దస్త్ దొరబాబు కామెంట్స్.. ఆ రోజు నా భార్య లేకపోతే..

జబర్దస్త్ దొరబాబు (dorababu amulya)

జబర్దస్త్ దొరబాబు (dorababu amulya)

Jabardasth: ఇన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారి ఆ మధ్య ఓ సంఘటనతో పోగొట్టుకున్నాడు దొరబాబు. ఈ ఏడాది మార్చిలో ఈయన పేరు మార్మోగిపోయింది. దానికి కారణం అప్పట్లో ఆయన వ్యభిచారం..

ఇన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారి ఆ మధ్య ఓ సంఘటనతో పోగొట్టుకున్నాడు దొరబాబు. ఈ ఏడాది మార్చిలో ఈయన పేరు మార్మోగిపోయింది. దానికి కారణం అప్పట్లో ఆయన వ్యభిచారం కేసులో పట్టుబడటమే. అప్పట్నుంచి ఇప్పటి వరకు దొరబాబుపై సెటైర్లు పడుతూనే ఉన్నాయి. పైగా హైపర్ ఆది కూడా తన ప్రతీ స్కిట్‌లో దాన్ని వాడుకుంటూ కామెడీ జనరేట్ చేస్తున్నాడు. అయినా అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లు.. అక్కడ పేకాట ఆడుతున్న బ్యాచ్‌పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసుల ముందు బుక్ అయిపోయాడు. అయితే ఈయన అలాంటి పరిస్థితుల్లో దొరికిన తర్వాత కూడా దొరబాబు భార్య మాత్రం ఆయనకే అండగా నిలబడింది. ఇదిలా ఉంటే ఆయన దొరికిన రోజు రాత్రి అసలేం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు, పరదేశీ కలిసి అక్కడ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కొందరు చెబుతున్నారు.. హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది.

దొరబాబు భార్య నందు (dorababu wife nandu)
దొరబాబు భార్య నందు (dorababu wife nandu)


మరోవైపు వీళ్లే వ్యభిచారం చేస్తున్నారని ఇంకొందరు చెప్పారు. అయితే ఇన్ని వార్తలు వస్తున్నా కూడా దొరబాబుకు మాత్రం ఆయన భార్య చాలా అండగా నిలిచింది. ఆ సమయంలో అందరికంటే ఎక్కువగా అతన్ని ఆమె సపోర్ట్ చేసింది. నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది. ఇంత మంచి భార్యా పిల్లలను పెట్టుకుని ఇవేం పనులయ్యా దొరబాబు అంటూ ఆయనకు క్లాస్ పీకేవాళ్లు ఇప్పటికీ పీకుతూనే ఉన్నారు.

హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)
హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు భార్య అమ్ము (hyper aadi dorababu)


ఇలాంటి సమయంలో దొరబాబు మాత్రం ఏం మాట్లాడటం లేదు. కానీ ఆయన భార్య అమ్ము మాత్రం విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్తుంది. తన మొగుడి తనకు తెలుసు.. ఎన్ని వచ్చినా కూడా తను నమ్మనని చెప్పకనే చెబుతుంది ఈమె. గతంలో కూడా యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడు దొరబాబు. అయినా కూడా ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే దొరబాబు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి అంటూ ఆయన సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో విమర్శించే వాళ్లను కోరుతున్నారు.

జబర్దస్త్ దొరబాబు భార్య (dorababu wife)
జబర్దస్త్ దొరబాబు భార్య (dorababu wife)


ఇదిలా ఉంటే ఇప్పుడు యాంకర్ రవి షోకు భార్యతో కలిసి వచ్చిన దొరబాబు.. అక్కడ మరోసారి ఆ విషయం గురించి గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో తనకు, తన భార్యకు తెలుసు అని.. ఇంకెవరికీ తను సమాధానం చెప్పుకోవాల్సి అవసరం లేదని చెప్పాడు. ఆ రోజు కానీ తన భార్య సపోర్ట్ లేకపోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదని.. ఆమె దొరకడం తన అదృష్టం అంటున్నాడు దొరబాబు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dorababu, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు