చిలికి చిలికి గాలి వానగా మారినట్టు ఇపుడు స్మాల్ స్క్రీన్ వర్గాల్లో దొరబాబు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గతం వారం రోజులుగా సోషల్ మీడియాలో దొరబాబు పేరు మారు మోగుతోంది. జబర్ధస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దొరబాబు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడటం స్మాల్ స్క్రీన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి అసలేం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. దొరబాబు, పరదేశీ కలిసి అక్కడ వ్యభిచార గృహం నడిపిస్తున్నారని కొందరు చెబుతున్నారు.. హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇంత జరిగినా.. దొరబాబు భార్య మాత్రం అతనికి అండగా నిలిబడింది. మా వారు అలాంటి వారు కాదని వెనకేసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె రోజా రచ్చబండకు ఎక్కాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ షో వేదికగా తనతో పాటు భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. పబ్లిక్‌గానే క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
రోజా ఒకవైపు జబర్ధస్త్ కామెడీ షో నిర్వహిస్తూనే మరోవైపు రచ్చబండ, బతుకు జట్కాబండి వంటి ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్వవహరిస్తూ ఎవరి కుటుంబంలోనైనా ఏదైనా కల్లోలం జరిగితే వాళ్లను ఈ ప్రోగ్రామ్‌కు పిలిపించి పెదరాయుడు తరహాలో తీర్పులు ఇస్తూ కాపురాలను సరిదిద్దుతూ ఉంది. ఇపుడు అదే తరహాలో దొరబాబును ఆయన భార్యను ఈ ప్రోగ్రామ్‌కు పిలిపించి ఆ రోజు అసలేం జరిగిందనేదానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. మొత్తానికి దొరబాబు వ్యవహారంలో రోజా అతనికీ అండగా నిలబడిందనే చెప్పాలి. అందుకే నిన్న జరిగిన జబర్ధస్త్ స్కిట్లో హైపర్ ఆదితో కలిసి దొరబాబు కనిపించడమే నిదర్శనం అంటున్నారు. మొత్తానికి దొరబాబు వ్యవహారంలో జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ అండగా నిలుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Roja, Telugu Cinema, Tollywood