Home /News /movies /

JABARDASTH COMEDIAN DEEPLY INSULTED ANCHOR SREEMUKHI ON STAGE IN FRONT OF CELEBS IN CHECK MOVIE PRE RELEASE PK

Anchor Sreemukhi: అందరూ చూస్తుండగానే యాంకర్ శ్రీముఖిని దారుణంగా అవమానించిన జబర్దస్త్ కమెడియన్..

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi hot/Instagram)

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi hot/Instagram)

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖికి తెలుగులో ఎలాంటి గుర్తింపు ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలతో పాటు టీవీ షోలు, యాంకరింగ్‌తోనూ బిజీగా ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడూ సుమ వదిలిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు కూడా ఈమె వైపు వస్తుంటాయి.

ఇంకా చదవండి ...
యాంకర్ శ్రీముఖికి తెలుగులో ఎలాంటి గుర్తింపు ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలతో పాటు టీవీ షోలు, యాంకరింగ్‌తోనూ బిజీగా ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడూ సుమ వదిలిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు కూడా ఈమె వైపు వస్తుంటాయి. అలా నితిన్, రకుల్, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన 'చెక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా ఫిబ్రవరి 26వ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21 రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని 'ఎన్ కన్వెన్షన్'లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి శ్రీముఖి హోస్టుగా ఉంది. తెల్లటి డ్రెస్సులో అద్భుతంగా రెడీ అయి వచ్చింది శ్రీముఖి. ఈమె ఎంట్రీతోనే విజిల్స్ వేసారు అభిమానులు. ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు ఎంటర్‌టైనింగ్‌గా నడిపించడానికి తనవంతు ప్రయత్నం చేసింది శ్రీముఖి. అయితే ఒక్కోసారి కొందరు కమెడియన్లు తమకు తెలియకుండానే చేసే కొన్ని కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అవతలి వాళ్లను ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు శ్రీముఖి విషయంలోనూ ఇదే జరిగింది. కార్యక్రమం మధ్యలో కొన్ని స్కిట్స్ చేసారు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అతడి టీం. ఆయనతో పాటు నూకరాజు కూడా వచ్చాడు. అయితే వాళ్లు ముందుగా స్క్రిప్ట్ కానీ స్కిట్ కానీ ప్రాక్టీస్ చేసుకోలేదు.. ఆ విషయం అక్కడ వాళ్ల తడబాటు చూస్తుంటేనే అర్థమైపోతుంది. దాంతో వాళ్లు చేసిన కామెడీ కానీ.. పంచులు కానీ అక్కడ పెద్దగా పేలలేదు. ఎప్పుడు అయిపోతుందిరా బాబూ అనేలా చూసారు ఆడియన్స్ కూడా. ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకోలేకపోవడం వలనో ఏమో కానీ ఆ సమయంలో ఏదో ఒకటి మాట్లాడేసారు. అక్కడే శ్రీముఖి బుక్ అయిపోయింది.
anchor sreemukhi,anchor sreemukhi twitter,anchor sreemukhi instagram,anchor sreemukhi hot photos,anchor sreemukhi check pre release,anchor sreemukhi jabardasth comedian emmanuel,anchor sreemukhi check pre release insult,anchor sreemukhi lover,anchor sreemukhi feb 14 love,telugu cinema,యాంకర్ శ్రీముఖి,శ్రీముఖి లవ్ స్టోరీ,యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం
శ్రీముఖి (Facebook/Photo)

చెక్ సినిమా అంతా చెస్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి వాళ్ల స్కిట్ కూడా దానిపైనే రాసుకున్నారు. ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్, నూకరాజు టీమ్ చేసిన స్కిట్‌తో శ్రీముఖిని అవమానించారు. చదరంగంలోని రాజులు, మంత్రులు, భటులు, గుర్రాలు అంటూ అలా సాగింది వాళ్ల స్కిట్. గుర్రం ఎల్ షేప్‌లో ఎందుకు పరిగెత్తుతుందంటే లవ్ అని.. అందుకే అది హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వైపు పరిగెత్తుతుందని చెప్పాడు నూకరాజు. మరి శ్రీముఖి వైపు గుర్రం ఎందుకు వెళ్లలేదు అనే ఇమ్మాన్యుయేల్ ప్రశ్నకు.. ఆమె ఏనుగులా ఉంటది కాబట్టి అంటూ నూకరాజు పంచ్ వేశాడు.
anchor sreemukhi,anchor sreemukhi twitter,anchor sreemukhi instagram,anchor sreemukhi hot photos,anchor sreemukhi check pre release,anchor sreemukhi jabardasth comedian emmanuel,anchor sreemukhi check pre release insult,anchor sreemukhi lover,anchor sreemukhi feb 14 love,telugu cinema,యాంకర్ శ్రీముఖి,శ్రీముఖి లవ్ స్టోరీ,యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం
అందాల శ్రీముఖి (Photo:Sreemukhi/Instagram)

దాంతో అక్కడే ఉన్న శ్రీముఖి కాస్త హర్ట్ అయింది. అలాంటి కుళ్లు జోకులు ఇక్కడ కాదు కదా వేయాల్సింది అన్నట్లు శ్రీముఖి వాళ్ల వైపు సీరియస్‌గా చూసింది. అంతేకాదు వెంటనే మైక్ కూడా తీసి వాళ్లకేదో చెప్పినట్లు కూడా అక్కడ కనిపించింది. ఏదేమైనా కూడా అంతమంది ముందు అలా అనడంతో శ్రీముఖి బాగానే హర్ట్ అయిందనే విషయం అర్థమైపోయింది. స్క్రిప్ట్ ముందుగా రెడీ లేకపోతే పరిస్థితులు ఇలాగే తిరగబడతాయి మరి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor srimukhi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు