Bigg Bogg 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో జబర్దస్త్ ట్రాన్స్‌జెండర్.. ఆపరేషన్ తర్వాత అదిరిపోయే ఆఫర్..

ప్రియాంక సింగ్ (Priyanka Singh)

Bigg Bogg 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Bogg 5 Telugu) మొదలు కావడానికి మరో రెండు వారాల సమయం కూడా లేదు. ఈ లోపు ఎవరెవరు ఇంట్లోకి వెళ్తున్నారనే విషయంపై రోజుకో వార్త బయటికి వస్తూనే ఉంది. తాజాగా జబర్దస్త్ కోటా నుంచి ఓ ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అయితే అందులో నవ్వించిన దానికంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు ఈ కమెడియన్. స్క్రీన్‌పై కామెడీ చేసే తన జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయంటున్నాడు ఈయన.. సారీ సారీ ఈమె. సాయితేజగా అందరికీ తెలిసినా కూడా తను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక. తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచే అక్క బట్టలు వేసుకోవడం.. ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ తెలియకుండా చేసానని చెబుతుంది ఈమె. ఇక చూసి చూసి చివరికి ఓ వయసు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నానని.. అమ్మాయిగా మారిపోయానని చెప్పింది ఈమె. అయితే అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అమ్మానాన్నలకు కూడా చెప్పలేదని.. అది వాళ్లకు నచ్చలేదని తెలిపింది ప్రియాంక. సర్జరీ చేయించుకుంటానని చెప్పినపుడు తన స్నేహితులే అండగా నిలిచారని.. అది జరిగిన తర్వాత 9 నెలలు నరకం చూసానని చెప్పింది ఈమె.

సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్న తర్వాత కూడా కెరీర్ స్లోగానే ఉంది. ప్రస్తుతం అదిరింది షోలో నటిస్తుంది ఈమె. అయితే ఇలా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి మాత్రం చాలానే ఖర్చు అయిందని తెలిపింది ప్రియాంక. సర్జరీ ఎక్కడ చేయించుకున్నావ్.. ఎంత ఖర్చు అయింది.. ఎవరెవరు వచ్చారు అలాంటి ప్రశ్నలు మాత్రం అడగొద్దని నేరుగానే యాంకర్‌కు షాక్ ఇచ్చింది పింకీ. ఆ వివరాలన్నీ తన పర్సనల్ అని.. కానీ భారీగానే ఖర్చు అయిందని మాత్రం చెప్పింది. ఆ ఖర్చు లక్షల్లోనే ఉంటుందని కూడా చెప్పింది. ఎవరూ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. అంతా తను సంపాదించిందే అని చెబుతుంది ఈమె.

Nagarjuna Rejected movies: నాగార్జున బర్త్ డే స్పెషల్.. ఆయన రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఇవే..


ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియాంక సింగ్‌కు అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ 5 తెలుగులో ట్రాన్స్‌జెండర్ కోటాలో ఈమె ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ క్రేజ్ కూడా ఉండటంతో ప్రియాంకకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ షోలో జబర్దస్త్ షో నుంచి ధన్‌రాజ్, ముక్కు అవినాష్ లాంటి వాళ్లు పాల్గొన్నారు. ఈ సారి మాజీ జబర్దస్త్ నటుడు అయిన సాయి తేజకు అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక సింగ్ క్వారంటైన్‌లో ఉంది. మరి అతడు కానీ ఆమె బిగ్ బాస్ 5 తెలుగులో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: