చమ్మక్ చంద్ర మరో సత్తిపండును వెతికి పట్టుకున్నాడుగా..

జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 24, 2019, 7:31 PM IST
చమ్మక్ చంద్ర మరో సత్తిపండును వెతికి పట్టుకున్నాడుగా..
సత్తిపండు ఆనంద్ కొత్త టీం (Jabardasth Comedy Show)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో ఆయనతో పాటే ఇప్పుడు జీ తెలుగుకు వచ్చాడు చంద్ర. ఆయన వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో ఫ్యామిలీ స్కిట్స్‌పై కచ్చితంగా ఎంతోకొంత దెబ్బ అయితే పడటం ఖాయం. అయితే చంద్ర స్కిట్స్ అంత నవ్విస్తాయంటే దానికి కారణం ఆయన టీంలో ఉండే సత్తిపండు కూడా. ప్రతీసారి అతన్ని బుక్ చేసి ఫుల్ కామెడీ పండిస్తుంటాడు చంద్ర. ఒక్కోసారి హద్దులు దాటినట్లు కనిపించినా కూడా ఫ్యామిలీ స్కిట్స్ చేసి నవ్వులు పూయిస్తుంటారు ఈ జోడీ.
Jabardasth Comedian Chammak Chandra moved to Zee Telugu and he replaced Sathipandu with another actor pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
ఆకెళ్ల సత్తిపండు ఫోటోస్

చమ్మక్ చంద్రకు సగం బలం సత్తిపండే. ఆ ఇద్దరూ కలిసారంటే చాలు రచ్చ రచ్చే అవుతుంది స్క్రీన్ మీద. ఇప్పుడు చంద్ర జీ తెలుగుకి వెళ్లిపోవడంతో ఆయనతో పాటు సత్తిపండు కూడా వెళ్లిపోతాడేమో అనుకున్నారంతా. ఎందుకంటే చంద్ర స్కిట్‌లో ఉండే లేడీ కూడా ఆయనతో పాటే జీ తెలుగుకు వెళ్లిపోయింది. కానీ సత్తిపండు మాత్రం జబర్దస్త్ షోలోనే ఆగిపోయాడు. ఆయనకు అక్కడ టీం లీడర్‌గా ప్రమోషన్ కూడా వచ్చింది. దాంతో సత్తిపండు హ్యాండిచ్చేసాడు. అందుకే ఇప్పుడు ఆయన స్థానంలో ఆకెళ్ల అనే మరో కమెడియన్‌ను పట్టుకొచ్చాడు.
Jabardasth Comedian Chammak Chandra moved to Zee Telugu and he replaced Sathipandu with another actor pk జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఈ షోను వదిలేసినా కూడా ఇంకా చంద్ర నామ జపమే చేస్తున్నారు ఆడియన్స్. నాగబాబు బయటికి వెళ్లిపోవడంతో.. jabardasth,jabardasth skits,jabardasth chammak chandra sathipandu skits,chammak chandra zee telugu,chammak chandra akella comedian,jabardasth chammak chandra,chammak chandra jabardasth sattipandu comedy,jabardasth chammak chandra,Jabardasth comedy show,jabardasth khatarnak comedy show,chammak chandra swathi naidu,swathi naidu fire on chammak chandra,chammak chandra jabardasth sattipandu,jabardasth chammak chandra controversy,chammak chandra movies,chammak chandra skits,telugu cinema,chammak chandra ramasakkanollu movie,చమ్మక్ చంద్ర సినిమాలు,చమ్మక్ చంద్ర జీ తెలుగు ఆకెళ్ల,చమ్మక్ చంద్ర సత్తిపండు కామెడీ,జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో,చమ్మక్ చంద్ర జబర్దస్త్,చమ్మక్ చంద్ర హీరో,చమ్మక్ చంద్ర రామసక్కనోళ్లు మూవీ
చమ్మక్ చంద్ర ఆకెళ్ల ఫోటోస్

ఛానెల్ మారినా తన స్టైల్ మాత్రం మార్చలేదు చంద్ర. అక్కడ కూడా సత్తిపండు స్థానంలో ఆకెళ్లను పెట్టి సేమ్ టూ సేమ్ ఫ్యామిలీ స్కిట్ చేసాడు. స్కిట్ బాగానే పేలినా సత్తిపండు లేని లోటు మాత్రం కనిపించింది. అయితే రెండు మూడు స్కిట్స్ తర్వాత ఆకెళ్ళ కూడా అలాగే ప్రేక్షకులకు అలవాటు అయిపోతాడని భావిస్తున్నాడు చంద్ర. అప్పటి వరకు కాస్త ఇబ్బందులు అయితే తప్పవు. మొత్తానికి తన టీంలో మరో సత్తిపండును అయితే వెతికి పట్టుకున్నాడు చంద్ర. మరి ఆయనతో ఈయన కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 24, 2019, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading