రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి..

లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.ప్రమాదంలో చంటి గాయాలపాలవడంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్టు సమాచారం.

news18-telugu
Updated: June 18, 2019, 9:07 AM IST
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి..
చలాకీ చంటి (File)
news18-telugu
Updated: June 18, 2019, 9:07 AM IST
టాలీవుడ్ హాస్య నటుడు, జబర్దస్త్ టీమ్ మెంబర్ చలాకీ చంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చంటి ప్రయాణిస్తున్న కారు సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని కొమరబండ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.చంటి గాయాలపాలవడంతో
హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్టు సమాచారం.అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. చంటి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. చంటి పలు సినిమాల్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...