HOME »NEWS »MOVIE »jabardasth comedian bullet bhaskar turns as director and saddam as hero in basthi boys sk

Jabardasth: డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్.. హీరో‌గా గల్లీ బాయ్ సద్దాం

Jabardasth: డైరెక్టర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్.. హీరో‌గా గల్లీ బాయ్ సద్దాం
బుల్లెట్ భాస్కర్, సద్దాం

Basthi Boys: నాగబాబు సమర్పణలో బస్తీ బాయ్స్ సినిమా వస్తోంది. బుల్లెట్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సృజన్, గుణసందీప్ మ్యూజిక్ అందిస్తున్నారు.

  • Share this:
    గల్లీ బాయ్స్.. జీ తెలుగు చూసే వారికి ఈ పేరు సుపరిచితమే. ఎందుకంటే.. నాగబాబు జడ్జిగా చేసిన అదిరింది, బొమ్మ అదిరింది షోల్లో వీరు చేసిన రచ్చ అలాంటిది. కమెడియన్ సద్దాం కామెడీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్‌లో మనోడి స్కిట్స్‌కు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఈ రెండు షోలు ప్రస్తుతం రాకున్నా.. యూట్యూబ్‌లో సద్దాం కామెడీ రచ్చ చేస్తోంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరైన సద్దాం ఇప్పుడు హీరోగా మారాడు. బస్తీ బాయ్స్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీకి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారో తెలుసా..? ప్రముఖ జబర్దస్త్ కమెడియన్.. బుల్లెట్ భాస్కర్. జబర్దస్త్‌గా టీమ్ లీడర్‌గా చేస్తున్న బుల్లెట్ భాస్కర్ బస్తీ బాయ్స్ చిత్రంతో దర్శకుడిగా పరిచమవుతున్నాడు.

    నాగబాబు సమర్పణలో బస్తీ బాయ్స్ సినిమా వస్తోంది. బుల్లెట్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సృజన్, గుణసందీప్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో సద్దాంతో పాటు ఇంకా ఎవరెవరు బాయ్స్ నటిస్తున్నారో గెస్ చేయాలన్నారు నాగబాబు. సరిగ్గా అంచనా వేసిన వారికి ఆ టీమ్‌తో లైవ్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అంతేకాదు ఆ బస్తీ బాయ్స్‌తో హైదరాబాద్ దావత్ ఉంటుందని చెప్పారు.



    కాగా, జబర్దస్త్‌తో పాటు అదిరింది షోలో చేసిన వారిలో ఎంతో మంది ఇప్పటికే వెండి తెరపై సందడి చేస్తున్నారు. ఇక కిరాక్ ఆర్పీ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పి.. దర్శకుడిగా మారారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా దర్శకుడిగా మారాడు. మరి బుల్లితెరపై మెప్పించిన ఆయన.. వెండితెరపై సక్సెస్ అవుతాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
    Published by:Shiva Kumar Addula
    First published:January 19, 2021, 08:29 IST