హోమ్ /వార్తలు /సినిమా /

Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు డబ్బింగ్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్

Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు డబ్బింగ్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్

మహేష్ బాబు సినిమాలోని పలు డైలాగ్స్ వేసి అలరించాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమన్నాడు బుల్లెట్ భాస్కర్. మహేష్ బాబు వాయిస్ పక్కవాళ్లకు కూడా వినిపించదన్నారు జబర్దస్త్ కమెడియన్.

మహేష్ బాబు సినిమాలోని పలు డైలాగ్స్ వేసి అలరించాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమన్నాడు బుల్లెట్ భాస్కర్. మహేష్ బాబు వాయిస్ పక్కవాళ్లకు కూడా వినిపించదన్నారు జబర్దస్త్ కమెడియన్.

మహేష్ బాబు సినిమాలోని పలు డైలాగ్స్ వేసి అలరించాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమన్నాడు బుల్లెట్ భాస్కర్. మహేష్ బాబు వాయిస్ పక్కవాళ్లకు కూడా వినిపించదన్నారు జబర్దస్త్ కమెడియన్.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి తెలిసిందే. చూడటానికి ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉంటాడో.. అంతే సింపుల్‌గా అనిపిస్తాడు. మాట తీరులో కూడా మహేష్ చాలా సింపుల్. అందుకే మహేష్‌ బాబు అనేకమంది అభిమానులు. ఇక మహేష్ ఇటీవలే నటిచిన మూవీ సర్కారు వారి పాట.. ఈ సినిమా ఈనెల 12న థియేటర్లలో విడుదలై... మంచి టాక్ తెచ్చుకుంది. ఇక సర్కారు వారి పాట ప్రమోషన్ల కోసం మహేష్ బాబు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మహేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వాయిస్‌ను ఎవరూ ఇమిటేట్ చేయలేరని.. తన వాయిస్‌ను ఎవరు కూడా కాపీ చేయలేరన్నారు మహేష్. దీంతో అందరూ కూడా అవును కదా.. మహేష్‌ వాయిస్‌ను ఎవరూ కాపీ కొట్టలేరు కదా అనుకున్నారు.

అయితే తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్.. మహేష్ సినిమాలకు డబ్బింగ్ చెప్పానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మహేష్ బాబు సినిమాకు  డబ్బింగ్ చెప్పానని తెలిపారు.  2014లో వచ్చిన నేనొక్కడినే సినిమా మొత్తానికి తానే డబ్బింగ్ చెప్పినట్లు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తెలిపారు. బుల్లెట్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర ప్రేక్షకులందరికీ బాగా సుపరిచతమైన పేరు. జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్‌కు పరిచయం అయ్యాడు. ఇక ఈ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ స్కిట్ వేస్తే అదిరిపోవాల్సిందే. అలాంటి బుల్లెట్ భాస్కర్ ... మహేష్ బాబు సినిమాలకు,ప్రకటనలకు డబ్బింగ్ చెబుతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు అతడు అచ్చు గుద్దినట్లు మహేష్ బాబు వాయిస్‌ను దింపేశాడు.

మహేష్ బాబు సినిమాలోని పలు డైలాగ్స్ వేసి అలరించాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమన్నాడు బుల్లెట్ భాస్కర్. మహేష్ బాబు వాయిస్ పక్కవాళ్లకు కూడా వినిపించదన్నారు. ఆయనను కలిసే అవకాశం ఇప్పటివరకు రాలేదన్నారు.  సర్కారు వారి పాటకు డబ్బింగ్ చెప్పే ఛాన్స్ వచ్చిన అది కుదరలేదన్నారు బుల్లెట్ భాస్కర్. ఇక మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు టైంలో ఆయన వాయిస్ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎంత మారిందన్నది కూడా బుల్లెట్ భాస్కర్ ఇమిటేట్ చేసి చెప్పేశాడు. దీంతో ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ వాయిస్ విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అచ్చం అలానే మాట్లాతున్నాడంటూ నివ్వెర పోతున్నారు. అంతేకాదు.. బుల్లెట్ భాస్కర్ మహేష్ బాబుతో పాటు.. పలువురు కమెడియన్ల వాయిస్‌ను కూడా మిమిక్రీ చేశాడు. ఎంఎస్ నాారయణ,కళ్లు చిదంబరం,కొండవరపు లక్ష్మణరావు గారు వాయిస్‌ను కూడా బుల్లెట్ భాస్కర్ ఇమిటేట్ చేశాడు.

First published:

Tags: BUllet bhasker, Jabardast comedian, Mahesh Babu

ఉత్తమ కథలు