హోమ్ /వార్తలు /సినిమా /

పొలంలో కలుపు ఏరేస్తున్న జబర్దస్త్ కమెడియన్..

పొలంలో కలుపు ఏరేస్తున్న జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)

జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)

Jabardasth Babu: అసలే లాక్‌డౌన్.. బయటికి వెళ్లేది లేదు.. షూటింగ్స్ కూడా ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు.. దాంతో ఇంటికే పరిమితమైపోయారు మన సెలబ్రిటీస్. అందులో జబర్దస్త్ కమెడియన్స్..

అసలే లాక్‌డౌన్.. బయటికి వెళ్లేది లేదు.. షూటింగ్స్ కూడా ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు.. దాంతో ఇంటికే పరిమితమైపోయారు మన సెలబ్రిటీస్. అందులో జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఉన్నారు. టైమ్ పాస్ కాని వాళ్లు యూ ట్యూబ్‌లో ఏదేదో వీడియోలు చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమ రియల్ లైఫ్ చూపిస్తున్నారు. జబర్దస్త్‌కు రాకముందు తామేం చేసేవాళ్లమో ఇప్పుడు ఆడియన్స్‌కు చూపిస్తున్నారు. పొలం పనులు చేసుకుంటూ హాయిగా ఊళ్లలో సెటిల్ అయిపోయారు. అందులో జబర్దస్త్ కమెడియన్ బాబు కూడా ఉన్నాడు. ఈ టీం.. ఆ టీం అనే తేడా లేకుండా అన్ని టీమ్స్‌లో కనిపిస్తుంటాడు బాబు.

జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)
జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)

కామెడీ రాదంటూ.. ఎక్స్‌ప్రెషన్స్ లేవంటూ ఆయన్ని అంతా ఆట పట్టిస్తుంటారు. అలాంటి కామెడీతోనే అందర్నీ నవ్విస్తుంటాడు బాబు. జబర్దస్త్ కామెడీ షోతో ఈయన బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన తన సొంతూళ్లో హాయిగా పొలం పనులు చేసుకుంటున్నాడు. ముఖ్యంగా తన పొలానికి వెళ్ళి అక్కడ అందరితో పాటు తాను కూడా కొడవలి పట్టి కలుపు తీస్తున్నాడు. తాను ఓ సెలబ్రిటీ అనే సంగతి కూడా మర్చిపోయాడు బాబు. హాయిగా ఫ్రెండ్స్‌తో ఉండటం.. వాళ్లతో ఎంజాయ్ చేయడం.. సొంత వాళ్లతో గడపటం ఇలా లాక్‌డౌన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)
జబర్దస్త్ కమెడియన్ బాబు (jabardasth babu)

ఇప్పుడు తన పొలంలో కలుపు తీస్తున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు బాబు. ఇది కాస్తా బాగానే వైరల్ అవుతుంది. అక్కడ పొలంలో అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డిని, కలుపు మొక్కలను తొలగిస్తున్నాడు బాబు. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో జబర్దస్త్ షూటింగ్ మొదలయ్యేలా కనిపించడం లేదు. దాంతో హాయిగా ఇంట్లోనే ఉండి అలా పొలం పనులతో కాలక్షేపం చేస్తున్నాడు ఈయన. మొన్నామధ్య మరో జబర్దస్త్ స్టార్ కమెడియన్ జీవన్ కూడా పొలం పనులు చేస్తూ వీడియో పోస్ట్ చేసాడు. ఇది కూడా వైరల్ అయింది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు