Home /News /movies /

JABARDASTH COMEDIAN AVINASH STILL THINKING ABOUT SUICIDE AND ARIYANA OPENS ABOUT IT PK

Jabardasth Avinash: అవినాష్‌ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న అంశాలేంటి.. అరియానా ఎందుకలా అన్నది..?

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth Avinash: జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్నాడు. జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చి కాదు ఏకంగా అక్కడ గుడ్ బై చెప్పి ఇక్కడికి వచ్చాడు ఈయన. అయితే ఒకప్పుడు కమెడియన్‌గా మాత్రమే తెలిసిన అవినాష్..

జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్నాడు. జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చి కాదు ఏకంగా అక్కడ గుడ్ బై చెప్పి ఇక్కడికి వచ్చాడు ఈయన. అయితే ఒకప్పుడు కమెడియన్‌గా మాత్రమే తెలిసిన అవినాష్.. బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత రెండో వైపు కూడా పరిచయం అయ్యాడు. ప్రతీ మనిషిలోనూ రెండు కోణాలుంటాయి అంటారు కదా.. అందులో ఇప్పుడు రెండో కోణం అందరికీ చూపిస్తున్నాడు అవినాష్. అయితే ఈయన ఆత్మహత్య చేసుకోవాలనుకునే విషయం మాత్రం ఇప్పటికీ సంచలనమే. ఆ మధ్య ఓ సారి బిగ్ బాస్‌లో తన అనుభవాలు, కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. అయితే అక్కడే ఉన్న అమ్మ రాజశేఖర్ ఈ విషయంలో చాలా తిట్టేసాడు.. ఇంకోసారి అలాంటి మాట అంటే తంతాను అన్నాడు. అయితే అదంతా గతం.. అక్కడితోనే అది అయిపోయిందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అరియానా మాటలు విన్న తర్వాత ఆత్మహత్య ఆలోచన ఇంకా అవినాష్ బుర్రలోంచి పోలేదేమో అనిపిస్తుంది.

jabardasth avinash,jabardasth avinash suicide plans,jabardasth avinash suicide ariyana,jabardasth avinash bigg boss 4 telugu,jabardasth avinash crying,jabardasth avinash crying in bigg boss 4 telugu,jabardasth avinash ariyana,telugu cinema,జబర్దస్త్ అవినాష్,బిగ్ బాస్ 4 అవినాష్,జబర్దస్త్ అవినాష్ ఏడుపు,జబర్దస్త్ అవినాష్ ఆత్మహత్య ఆలోచన
బిగ్ బాస్ 4 అమ్మ రాజశేఖర్ అవినాష్ (avinash amma rajasekhar)


నిన్నటికి నిన్న అమ్మ రాజశేఖర్‌తో కలిసి అవినాష్ కూడా డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ ఇద్దర్నీ రెండు బూత్‌లలో ఉంచి ఒకర్ని ఎలిమినేట్ చేసారు. అందులో అమ్మ బయటికి వచ్చేసాడు. అయితే బూత్‌లోకి వెళ్లేముందు అందరితోనూ మాట్లాడాడు అవినాష్. అక్కడే ఉన్న అరియానా వచ్చి మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ముఖ్యంగా అవినాష్ నువ్వేం చేసుకోకు.. నా గురించి ఆలోచించు.. కనీసం నేను బయటికి వచ్చేవరకు ఎలాంటి పిచ్చిపని చేయకు.. నువ్వు బతికుండు అవినాష్.. నీ కాళ్లు పట్టుకుంటా అంటూ ఏడ్చేసింది. ఈ మాటలు విన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. అంటే అవినాష్ బుర్రలో ఇంకా ఆత్మహత్య ఆలోచన పోలేదా అంటూ షాక్ అవుతున్నారు.

jabardasth avinash,jabardasth avinash suicide plans,jabardasth avinash suicide ariyana,jabardasth avinash bigg boss 4 telugu,jabardasth avinash crying,jabardasth avinash crying in bigg boss 4 telugu,jabardasth avinash ariyana,telugu cinema,జబర్దస్త్ అవినాష్,బిగ్ బాస్ 4 అవినాష్,జబర్దస్త్ అవినాష్ ఏడుపు,జబర్దస్త్ అవినాష్ ఆత్మహత్య ఆలోచన
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


ఎందుకంటే ఎన్నిసార్లు అలా అరియానాతో అవినాష్ చెప్పుంటే ఆ స్థాయిలో ఆమె తిరిగి అలా చెప్తుంది అంటూ అభిమానులు కూడా షాక్‌లోనే ఉన్నారు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసినంత మాత్రానా అంతా అయిపోయినట్లు కాదు కదా.. బయట బతకడం కూడా కష్టమేనా.. ఎందుకు అవినాష్ అంత దారుణంగా ఆలోచిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆర్థికంగా తన దగ్గర ఇప్పుడు డబ్బుల్లేవని.. పూర్తిగా నష్టపోయానని చెప్తున్నాడు అవినాష్. సేవ్ అయిన తర్వాత కూడా వెక్కివెక్కి ఏడ్చిన అవినాష్.. జీరో అయిపోయానని.. ఒక్కసారిగా గుండె ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఇదంతా చూస్తుంటే అవినాష్ ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నాడని అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth avinash, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు