Jabardasth: జబర్దస్త్ కమెడియన్‌కు అనుకోని ప్రమాదం.. ప్రేక్షకుల్లో టెన్షన్ టెన్షన్..

Jabardasth: తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రియమైన షో జబర్దస్త్ కామెడీ షో. ఇందులో వచ్చే కమెడియన్లు కూడా చాలా మంది ఆడియన్స్ మనసుకు బాగా కనెక్ట్ అయిపోయారు. అందులోంచే కదా ఇప్పుడు బుల్లితెర స్టార్స్‌గా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 1, 2020, 1:33 PM IST
Jabardasth: జబర్దస్త్ కమెడియన్‌కు అనుకోని ప్రమాదం.. ప్రేక్షకుల్లో టెన్షన్ టెన్షన్..
జబర్దస్త్ కామెడీ షో లోగో (jabardasth comedy show)
  • Share this:
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ప్రియమైన షో జబర్దస్త్ కామెడీ షో. ఇందులో వచ్చే కమెడియన్లు కూడా చాలా మంది ఆడియన్స్ మనసుకు బాగా కనెక్ట్ అయిపోయారు. అందులోంచే కదా ఇప్పుడు బుల్లితెర స్టార్స్‌గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు ఈ కామెడీ షో నుంచే వచ్చారు. చిన్న స్క్రీన్‌పై రప్ఫాడిస్తున్నారు. రేటింగ్స్ కూడా దుమ్ము దులిపేస్తున్నారు. ఇదిలా ఉంటే వీళ్లలో ఏ ఒక్కరికి ఏదైనా అయితే మాత్రం వెంటనే అంతా బాధ పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్‌కు అనుకోని ప్రమాదం జరిగింది. అది కూడా జబర్దస్త్ షోలో కాదు.. బయటెక్కడో. ఎవరబ్బా అనుకుంటున్నారా.. ఇంకెవరు మన ముక్కు అవినాష్‌కే. ఈయన ఇప్పుడు జబర్దస్త్ నుంచి బిగ్ బాస్‌కు వచ్చాడు.

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


అక్కడే తన అల్లరి కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు రచ్చ చేస్తూనే ఉన్నాడు అవినాష్. అందరితో కలిసిపోయాడు.. నవ్వుతున్నాడు.. నవ్విస్తున్నాడు. ఈయన దూకుడు చూస్తుంటే కనీసం పది వారాలు అయితే సేఫ్‌గానే ఉంటాడనిపిస్తుంది. ఇంట్లో అందరికీ ఫేవరేట్ కావడంతో కనీసం నామినేషన్స్‌లోకి కూడా రావట్లేదు ఈయన. ఇదిలా ఉంటే తాజాగా ఈయన గాయపడ్డాడు. ఇంట్లో కాయిన్స్ టాస్క్‌లో భాగంగా అవినాష్‌కు అనుకోని ప్రమాదం జరిగింది. కిల్లర్ కాయిన్స్ అంటూ బిగ్ బాస్ మొదలు పెట్టిన టాస్క్‌లో చాలా మందికి దెబ్బలు తగిలాయి.

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


అఖిల్, మోనాల్, సుజాత లాంటి వాళ్లు గాయాల పాలయ్యారు. ఇక అవినాష్ అయితే ఏకంగా కింద పడిపోయాడు. కాలు బెనకడంతో ఈయన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే వైద్యులు రావడంతో వాళ్ల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకుంటున్నాడు అవినాష్. కొత్త ప్రోమోలో కూడా ఈయన కనిపించడం లేదు. గాయం కాస్త పెద్దదే కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు ఈయన. మరో రెండు మూడు రోజుల్లో మళ్లీ సెట్ అయిపోయి.. టాస్కుల్లో కుమ్మేయాలని చూస్తున్నాడు అవినాష్. ఏదేమైనా కూడా అవినాష్ కాలుకు గాయమవడం అటు బిగ్ బాస్ అభిమానులనే కాదు జబర్దస్త్ ఫ్యాన్స్‌ను కూడా కలవరపెడుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 1, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading