• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDIAN AVINASH CRYING IN BIGG BOSS 4 TELUGU AND HERE THE REASON PK

Bigg Boss 4 Avinash crying: వెక్కి వెక్కి ఏడ్చిన అవినాష్.. కారణం ఏమై ఉంటుందబ్బా..

Bigg Boss 4 Avinash crying: వెక్కి వెక్కి ఏడ్చిన అవినాష్.. కారణం ఏమై ఉంటుందబ్బా..

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Bigg Boss 4 Avinash crying: బిగ్ బాస్ 4 తెలుగులో ఆదివారం వచ్చిందంటే చాలు.. సన్ డే కాస్తా ఫన్ డే అయిపోతుంది. ఎపిసోడ్ చివర్లో ఒకర్ని ఎలిమినేట్ చేసినా కూడా వాళ్లను కూడా నవ్వుతూనే పంపిస్తాడు బిగ్ బాస్. ఆ రోజు అలా ప్లాన్ చేస్తుంటాడు బిగ్ సామి..

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో ఆదివారం వచ్చిందంటే చాలు.. సన్ డే కాస్తా ఫన్ డే అయిపోతుంది. ఎపిసోడ్ చివర్లో ఒకర్ని ఎలిమినేట్ చేసినా కూడా వాళ్లను కూడా నవ్వుతూనే పంపిస్తాడు బిగ్ బాస్. ఆ రోజు అలా ప్లాన్ చేస్తుంటాడు బిగ్ సామి. అయితే ఎలా చేసినా కూడా చివరికి మాత్రం కచ్చితంగా ఎవరో ఒకరు ఎమోషనల్ అవ్వడం.. అరుచుకోవడం.. ఏడవడం మాత్రం కామన్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మరోసారి బిగ్ బాస్‌లో ఏడుపులు వినిపించాయి. అందులో ఎవరూ ఊహించని విధంగా అవినాష్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో ఏమై ఉంటుందా అని అంతా షాక్ అవుతున్నారు. అసలేంటిది అంటూ అవాక్కవుతున్నారు. సన్ డే ఎపిసోడ్‌లో చాలా విశేషాలున్నాయి. మరీ ముఖ్యంగా సుమ కనకాల వచ్చింది. కంటెస్టెంట్స్ అందర్నీ బాగానే నవ్వించింది సుమ. ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ట్విస్ట్ కూడా ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే మరోవైపు నాగార్జున కూడా కంటెస్టెంట్స్‌తో బాగానే ఆడుకున్నాడు. దివాళీ గిఫ్టులు తీసుకొచ్చిన నాగార్జున.. వాటిని దక్కించుకోవాలంటే తను చెప్పినట్లు చేయాలని కండీషన్ పెట్టాడు.

అందులో భాగంగా అభిజీత్‌ను డాన్సులు చేయాలని చెప్పాడు. అలాగే హారికతో కూడా స్టెప్పులు వేయించాడు నాగార్జున. ఈ క్రమంలోనే అవినాష్ మాత్రం వెక్కివెక్కి ఏడ్చాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. అసలెందుకు జబర్దస్త్ కమెడియన్ అంతగా ఏడ్చేసాడు అనేది మాత్రం అంతు చిక్కని విషయం. ఒకవేళ అక్కడ కూడా ఏదైనా టాస్క్ ఇచ్చాడా.. ఎప్పుడూ నవ్వించే అవినాష్‌కు ఏడిపించే సత్తా కూడా ఉందా లేదా అని తెలుసుకోడానికి అలా చేసాడా అనేది చూడాలి. ఏదేమైనా కూడా అవినాష్ ఏడ్చిన కారణం ఏదైనా కూడా అతన్ని ఏడిపించడం మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. మరి చూడాలి.. అవినాష్ ఎందుకు ఏడ్చాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు