హోమ్ /వార్తలు /సినిమా /

నాగబాబుకు ఆటో రాంప్రసాద్ చురక.. కమెడియన్ జబర్దస్త్ పంచ్..

నాగబాబుకు ఆటో రాంప్రసాద్ చురక.. కమెడియన్ జబర్దస్త్ పంచ్..

నాగబాబు జబర్దస్త్ రాంప్రసాద్ (nagababu ram prasad)

నాగబాబు జబర్దస్త్ రాంప్రసాద్ (nagababu ram prasad)

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఆటో రాంప్రసాద్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్‌గా ఇండస్ట్రీకి వచ్చి రైటర్‌గా ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు రాంప్రసాద్.

జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఆటో రాంప్రసాద్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్‌గా ఇండస్ట్రీకి వచ్చి రైటర్‌గా ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు రాంప్రసాద్. ప్రస్తుతం హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు రాంప్రసాద్. తన స్నేహితులతో కలిసి 3 మంకీస్ సినిమా చేసాడు ఈయన. ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి నటించడంతో ఆసక్తి కూడా బాగానే ఉంది. అయితే సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది పక్కనబెడితే ప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం జబర్దస్త్ టీం అంతా కలిసి వచ్చారు. అంతా కలిసి సుడిగాలి సుధీర్ టీం నటించిన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంఛ్

ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షోపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు ఈయన. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే ఆలోచన ఉందా.. చాలా కొత్త షోలు మొదలవుతున్నాయి కదా అందులోంచి ఆఫర్స్ రావడం లేదా.. ఎందుకు వెళ్లట్లేదని అడిగితే సంచలన సమాధానం చెప్పాడు రాంప్రసాద్. ‘జబర్దస్త్‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు. అందుకే నేను వేరే ఏ షోకి వెళ్లలేదు. ‘జబర్దస్త్‌’ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అది ఒక మ్యాజిక్. మళ్లీ ఒక కొత్త షోతో అలాంటి మ్యాజిక్ జరగాలంటే సాధ్యం కాదని తేల్చేసాడు ఈ కమెడియన్. అందుకే తాను ఎక్కడికి వెళ్లడం లేదని.. వచ్చినా జబర్దస్త్ చచ్చినా వదిలిపెట్టనని క్లారిటీ ఇచ్చేసాడు ఈయన.

నాగబాబు జబర్దస్త్ రాంప్రసాద్ (nagababu ram prasad)
నాగబాబు జబర్దస్త్ రాంప్రసాద్ (nagababu ram prasad)

తనతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఇక్కడే ఉంటామని కన్ఫర్మ్ చేసాడు. ఈయన మాటలు బట్టి చూస్తుంటే నాగబాబుకు కూడా భారీ షాక్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. కొత్త షో.. కొత్త పారితోషికం అని వెళ్లిన నాగబాబుకు ఇప్పుడక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. చెక్కులు ఎక్కువే వస్తున్నా కూడా షో ఫ్లాప్ కావడంతో రిటర్న్ వచ్చేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నాడు ఈయన. ఇలాంటి సమయంలో రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి పుట్టిస్తున్నాయి. ఎన్ని షోలు వచ్చినా కూడా జబర్దస్త్ ముందు తుస్ అంటున్నాడు ఈయన. బయట పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. జీ తెలుగులో మొదలైన అదిరింది షోకు కూడా అంతగా ఆదరణ రావడం లేదు. ఇలాంటి టైమ్‌లో రాంప్రసాద్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు