హోమ్ /వార్తలు /సినిమా /

Roja:ఎమ్మెల్యే, మంత్రి.. రోజాకు ఆ పదవి కూడా రావాలన్న జబర్దస్త్ నటుడు

Roja:ఎమ్మెల్యే, మంత్రి.. రోజాకు ఆ పదవి కూడా రావాలన్న జబర్దస్త్ నటుడు

రోజా

రోజా

అందర్నీ వదిలి వెళ్లాలంటే తనకు కూడా కష్టంగా ఉందన్నారు రోజా. తాను ఎక్కడ ఉన్నా జబర్దస్త్ టీంను మాత్రం గుర్తుపెట్టుకుంటానన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే వస్తానన్నారు.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇటీవలే ఏపీ కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో రోజా ఇటీవల పర్యటన, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మంత్రిగా అవకాశం రావడంతో.. రోజా వెండితెరతో పాటు బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై సినిమాలు... ఎలాంటి టీవీ షోలు చేయనని చెప్పారు. తన పూర్తి సమయం ప్రజాసేవకే కేటాయిస్తానన్నారు రోజా. అయితే తాజాగా రోజా పాల్గొన్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. జబర్దస్త్‌లో రోజా చేసిన చివరి ఎపిసోడ్ ఇదే కావడంతో... జబర్దస్త్ టీం అంతా రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు.

మల్లెమాల ప్రొడక్షన్ సభ్యులతో పాటు, జబర్దస్త్ నటీ నటులంతా రోజాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్ కామెడీ యాక్టర్స్ మాట్లాడుతూ.. రోజాతో తమకున్న అనుబంధం గురించి చెప్పుకున్నారు. రోజా గారు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలన్నారు జబర్దస్త్ సభ్యులు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. మల్లెమాల మాకు ఎంత సపోర్ట్ చేసిందో.. స్టేజ్‌పై రోజాగారు కూడా మమ్మల్ని అంతే సపోర్ట్ చేశాడన్నారు. మేం రోజా గారును చాలా మిస్ అవుతామన్నారు. రోజా గారు మళ్లీ రావాలనే కోరుకుంటా.. ఇక్కడ ఉండాలని కోరుకుంటాం.. ఆ దేవుడు మమ్మల్ని అలాగే బ్లస్ చేయాలని కోరుకుంటామన్నారు సుధీర్. రోజా కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు సుధీర్. ఆ తర్వాత రోజా తమ ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువగా సపోర్ట్ చేశారని మిగతా సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.

ఇక మరో జబర్దస్త్ నటుడు ఆటో రాం ప్రసాద్ మాట్లాడుతూ.. తనకు ఆటో రాం ప్రసాద్ అనే పేరు పెట్టిందే రోజా మేడమ్ అని గుర్తు చేసుకున్నాడు. ఆ పేరుతోనే అదే ఆటోలో డీజిల్ కొట్టించుకుంటూ పోతున్నానని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు బాధ ఏంటంటే.. ఇంతకుముందు స్కిట్ రాసుకుంటే సగం స్కిట్ మేడం చూసుకునేవాళ్లు. అయితే ఇప్పుడు మరి అంటూ తల గోక్కున్నాడు రామ్ ప్రసాద్. ఇదే అందం.. ఈ స్మైల్ ఇలానే రోజా గారు మెంటైన్ చేయాలన్నాడు రామ్ ప్రసాద్.ఎక్కడికి వెళ్లినా మేం టీవీలో చూస్తామన్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నారు.. తర్వాత పార్లమెంట్ అన్నాడు రామ్ ప్రసాద్. ఎక్కడైన ఒకసారి జై జబర్దస్త్ అనాలన్నాడు. మీరు ఎక్కడికి వెళ్లిన మమ్మల్ని గుర్తు పెట్టుకుంటానన్నారు ఆ మాట చాలు మాకు అంటూ రామ్ ప్రసాద్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

అయితే రోజా కూడా తనకు వీడ్కోలు పలుకుతున్న జబర్దస్త్ టీం సభ్యులను ఉద్దేశించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంటర్‌టైన్ మెంట్‌లో ఈ జనరేషన్‌కు గుర్తుండిపోయేలా పదేళ్ల పాటు షోను సక్సెస్‌ఫుల్ గా నడిపారన్నారు. నేను రెండు సార్లు ఎమ్మెల్యే కూడా ఇక్కడే అయ్యాను.. మంత్రి కూడా ఇక్కడ నుంచే అవ్వాలని అనుకున్నానన్నారు. ఆ నమ్మకంతో జబర్దస్త్‌కు వచ్చానన్నారు రోజా. భగవంతుడి ఆశీస్సులతో నగరి ప్రజల ఆశీస్సులతో తన కల నేరవేరిందన్నారు.జబర్దస్త్‌ను వదిలిని వెళ్లడం చాలా కష్టంగా ఉందన్నారు. తనకు ఎప్పుడు చూడాలన్న వచ్చి చూస్తా అన్నారు. కానీ అందర్నీ మిస్ అవుతానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్వీస్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అలాంటి వాటి కోసం నాకు ఇష్టమైనవి కూడా వదులుకోవాల్సి వస్తుందన్నారు. తప్పుగా ఎవరూ అనుకోకండాన్నారు రోజా. అంతా తనకు సపోర్ట్ చేయాలన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చిన తప్పకుండా వస్తానని జబర్దస్త్ టీంకు మాట ఇచ్చారు రోజా.ఎవరికి ఏ సాయం కావాలన్న చేస్తానన్నారు.అందరికీ పేరు పేరున థాంక్స్ చెబుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు రోజా.

First published:

Tags: Auto ram prasad, Extra jabardasth, Jabardast comedian, Minister Roja

ఉత్తమ కథలు