తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో 'జబర్ధస్త్'. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈటీవీ షో ద్వారా ‘జబర్ధస్త్’ జడ్జ్‌గా తెలుగు ప్రేక్షకులు మదిలో కొలువైయ్యాడు .. అయితే స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు వినోదాల విందిచ్చిన నాగబాబు.. ఇటీవలే జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు. కారణాలేమైనప్పటికీ ఆయన ఇలా హఠాత్తుగా తప్పుకోవడం టీవీ ఆడియన్స్‌కి షాకిచ్చింది. నాగబాబు జబర్దస్త్ వీడటం అటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా ఈ విషయంపై కమెడియన్ అప్పారావు స్పందించారు. 'జబర్దస్త్' కామెడీ షోకి నిండుదనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నాగబాబుగారు. ఈ షో అంటే నాగబాబుగారికి చాలా ఇష్టమని అప్పారావు చెప్పుకొచ్చాడు. ఆ మధ్య చాలా తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ ఆయన ఈ షోకి రావడం మానలేదని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు.
అంతలా జబర్దస్త్ షోను నాగబాబు ఓన్ చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. అలాంటిది ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారనే వార్త విని తాను షాక్ అయ్యానని చెప్పాడు అప్పారావు. అయితే నాగబాబు గారు ఈ షో నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషికం మాత్రం కాదని ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి.. ఆ వైపు నుంచి ఎలాంటి సందేహం లేనట్టే. ఏదేమైనా జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడం బాధ కలిగించే విషయం అని అప్పారావు పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Nagababu, Telugu Cinema, Tollywood