బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న షో జబర్దస్త్. రేటింగుల్లో టాప్ షోగా నిలిచింది. ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త కమెడియన్లు
బుల్తితెరతో పాటు వెండితెరకు పరిచయం అయ్యారు. ఎంతో మందిని స్టార్ కమెడియన్స్‌ను కూడా తయారు చేసింది. అయితే తాజాగా జబర్దస్త్ షో(Jabardasth Show)పై సంచలన వ్యాఖ్యలు చేశారు కమెడియన్ అప్పారు. గత కొంతకాలంగా ఈ షోకు దూరంగా ఉన్న ఆయన కీలక ఆరోపణలు చేశారు. జబర్దస్త్ షో తనకు లైఫ్ ఇచ్చిందన్నారు అప్పారావు(Appa Rao). అలాంటి షోనే తనను కొంతకాలం హోల్డ్‌లో పెట్టిందన్నారు. దీంతో బాధతో తానే షోకు దూరమైపోయానన్నారు. తనపై లేని పోని పుకార్లు సృష్టించారన్నారు. తాను బిగ్ బాస్(Bigg Boss)కు వెళ్లిపోతున్నానని.. సినిమాల్లోకి వెళ్తున్నానంటూ ఆరోపణలు చేశారన్నారు.
జబర్దస్త్‌లో మోసేవాళ్లు.. కూసేవాళ్లు.. తోసేవాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. అలాగే చెప్పుడు మాటలు వినేవాళ్లు కూడా లేకపోలేదన్నారు. తన ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే.. తాను ఒక్కరోజు ఒక్క ప్రాక్టీస్‌కు కానీ షూట్‌కు కాని ఎగనామం పెట్టలేదన్నారు.
తన ట్రాక్ రికార్డ్ చేసుకోమని చెప్పారు అప్పారావు. జబర్దస్త్(Jabardasth) తన లైఫ్ అనుకున్నానని... ఇప్పటికే అదే అంటానన్నారు అప్పారావు(Appa Rao). బయటకు వచ్చేస్తే కనీసం సీనియర్ కదా అని కూడా ఎవరూ పిలిచి తనను మాట్లాడలేదని ఆవేనద వ్యక్తం చేశారు. సీనియర్లకు గౌరవం లేదన్నారు. మనసు బాధ పడిందంటే.. మనసు మాట వినదన్నారు. తనను జబర్దస్త్ షోకు పరిచయం చేసింది మాత్రం షకలక శంకర్ అన్నారు. తాను ఇవాళ ఇంటర్య్వూ ఇచ్చే స్థాయికి వచ్చానంటే దానికి కారణం జబర్దస్త్, మల్లేమాల(Malle Mala) ప్రొడక్షన్ అన్నారు అప్పారావు.
అయితే జబర్దస్త్ తనకు ఫస్ట్ షో కాదన్నారు. అంతకుముందు తను ఐదు షోలలో చేశానని తెలిపారు. ఇప్పుడు జబర్దస్త్(Jabardasth) కంటే మంచి పొజిషన్లో ఉన్నానన్నారు. అక్కడ కంటే మంచి పేమెంట్‌లో ఉన్నానన్నారు. ఇప్పుడు ఆయనకు డబుల్ పేమెంట్ వస్తోందన్నారు.మంచి టీమ్ లీడర్ దగ్గర కూడా ఉన్నానన్నారు. ఇప్పుడు జబర్దస్త్ షోకు ధీటుగా ఇప్పుడు తమ షో నడుస్తుందన్నారు అప్పారావు. తాను ప్రస్తుతం చేస్తున్న షో మంచి రేటింగ్‌లో కూడా ఉందన్నారు. జబర్దస్త్ యంగ్ స్టార్స్, యంగ్ డైరెక్టర్స్ వల్ల మంచి హిట్ సాధించిందని చెప్పుకొచ్చారు. జబర్దస్త్‌లో చేసిన తర్వాత ఆయన ఇప్పటివరకు 150 సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చారు.
జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కామెడియన్లకు పేరు వచ్చింది. సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) .. హైపర్ ఆది .. గెటప్ శ్రీను(Getup Srinu) వంటి వారు సినిమాల్లోను బిజీ అవుతున్నారు. ఇక మిగతావారు ఇతర గేమ్ షోలలో కనిపిస్తున్నారు. అలాంటివారిలో అప్పారావు కూడా ఒకరుగా కనిపిస్తారు. అయితే కొంత కాలంగా ఆయన ఈ షోలో కనిపించడం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆయన జబర్దస్త్ షోపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.