Jabardasth Comedian: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ షో బుల్లితెరలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో పాల్గొనే కమెడియన్స్ తమ కామెడీ టైమింగ్స్ తో తెగ నవ్విస్తుంటారు. అంతేకాకుండా వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ఎంతోమంది మామూలు వ్యక్తులు జబర్దస్త్ లో మంచి గుర్తింపు అందుకోని స్టార్ హోదా లో ఉండగా.. మరో మామూలు వ్యక్తి కూడా జబర్దస్త్ కి వచ్చాక ఎంతో ఎదిగిపోయాడు. ఇంతకీ అతను ఎవరో కాదు.. ఆనంద్. ఎక్కడి నుండో వచ్చి జబర్దస్త్ షోతో మంచి కమెడియన్ గా ఎదిగాడు. చమ్మక్ చంద్ర టీమ్ లో పనిచేసి పదేళ్లలో టీం లీడర్ గా నిలిచాడు. తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్విస్తూ మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఐదు కోట్ల కారుకు అడ్వాన్స్ ఇచ్చాడట ఆనంద్.
ఈమధ్య ఓ యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకున్నాడు జబర్దస్త్ ఆనంద్. ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేసుకుంటాడు. అంతేకాకుండా కొన్ని వీడియోలను కూడా చేస్తుంటాడు. ఇక ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో సరదాగా కాసేపు మా ఫ్యామిలీతో అనే వేదికగా తన భార్యాబిడ్డల్ని అభిమానులకు పరిచయం చేశాడు.
తన భార్య తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యిందని.. పెళ్లి సమయంలో సినిమా తీసే అంత పెద్ద స్టోరీ ఉందనే చెప్పుకున్నాడు. ఇక తన పెళ్ళికి రోజా, చమ్మక్ చంద్ర సహాయం చేశారని కూడా చెప్పాడు. ఇక ఇటీవలే తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చాక చాలా రోజులకు తన ఇంటికి వెళ్తున్నామని వీడియో తీసి తన ప్రయాణాన్ని మొత్తాన్ని అందులో బంధించి అభిమానులకు షేర్ చేసుకున్నాడు.
ఇటీవలే తన హోమ్ టూర్ ను కూడా చూపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియోను వదిలాడు. అందులో హైదరాబాదులో ఖరీదైన కార్లను చూడగా రూ.5.6 కోట్లు విలువచేసే కారును సెకండ్ హ్యాండ్ లో మూడు కోట్లకు కొంటున్నానని.. అంతేకాకుండా అడ్వాన్స్ ఇస్తున్నట్లు కూడా తెలిపాడు. మరో రెండు నెలల్లో ఈ కారు కొంటున్నానని తెలిపాడు. ఇది చూసిన అభిమానులతో పాటు టీమ్ లీడర్స్ కూడా షాక్ అవుతున్నారు. కొందరు ఇదేదో అడ్వర్టైజ్ కు సంబంధించిందేమోనని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.