సుడిగాలి సుధీర్ చెల్లెలుగా రష్మీ... చమ్మక్ చంద్ర జిమ్మిక్

Jabardasth | జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, నటుడు సుడిగాలి సుధీర్ మధ్య సంథింగ్.. సంథింగ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో బీభత్సంగా జరుగుతూ ఉంటుంది.

news18-telugu
Updated: September 22, 2019, 5:01 PM IST
సుడిగాలి సుధీర్ చెల్లెలుగా రష్మీ... చమ్మక్ చంద్ర జిమ్మిక్
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)
  • Share this:
జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ పేర్లు చెబితే అభిమానుల్లో ఓ వైబ్రేషన్ వస్తుంది. వారిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో బీభత్సంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలా సార్లు స్కిట్లు చేస్తుంటారు. అయితే, ఈసారి ఆ కామెడీ మరింత పీక్ స్టేజ్‌కి చేరింది. వచ్చేవారానికి సంబంధించి స్కిట్ ప్రోమో రిలీజ్ అయింది. అందులో సుడిగాలి సుధీర్ టీమ్ కాలేజ్ స్టూడెంట్స్‌గా యాక్ట్ చేస్తోంది. కాలేజీకి వచ్చిన అమ్మాయిలను సుధీర్, రాంప్రసాద్ ఇద్దరూ ర్యాగింగ్ చేస్తుంటారు. అయితే, ఆ కాలేజీకి లెక్చరర్‌గా వచ్చిన చమ్మక్ చంద్ర వారికి పనిష్మెంట్ ఇస్తాడు. కాలేజీలో అందరు అమ్మాయిలని చెల్లెళ్లలా చూడాలంటాడు. రష్మీని కూడా చూపించి చెల్లెమ్మా అని పిలవమంటాడు. అయితే, అందరూ ఒకే కానీ, రష్మీ ఒక్కదాన్నీ మాత్రం వదిలేయమంటాడు. ఈ స్కిట్ చూస్తుంటే... చమ్మక్ చంద్ర సుడిగాలి సుధీర్‌ను ఇరికించినట్టుగానే ఉన్నాడు.
First published: September 22, 2019, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading