Home /News /movies /

JABARDASTH CHALAKI CHANTI HILARIOUS SPOOF ON RAKESH MASTER PK

రాకేష్ మాస్టర్‌పై అదిరిపోయే పంచ్ వేసిన జబర్దస్త్ చంటి..

చలాకీ చంటి రాకేష్ మాస్టర్ (chalaki chanti rakesh master)

చలాకీ చంటి రాకేష్ మాస్టర్ (chalaki chanti rakesh master)

Jabardasth Chanti: ఈ మధ్య కాలంలో రాకేష్ మాస్టర్ ఎంత రచ్చ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో రాకేష్ మాస్టర్ ఎంత రచ్చ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆయనే కనిపిస్తున్నాడు. అందరినీ టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా చిన్నాపెద్దా తేడా లేకుండా ఏకి పారేస్తున్నాడు. అడిగిన వాళ్లను పోరా జప్ఫా అంటూ విరుచుకుపడుతున్నాడు. శేఖర్ మాస్టర్ సహా చాలా మందిని టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసాడు రాకేష్ మాస్టర్. దాంతో ఆయన్ని పట్టించుకోవడం కూడా మానేసారు చాలా మంది.
చలాకీ చంటి (File)
చలాకీ చంటి (File)

ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో రాకేష్ మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ అదిరిపోయే స్కిట్ చేసాడు చంటి. ఈయన చేసిన స్కిట్ చూసి పగలబడి నవ్వుకున్నారు రోజా, మనో. చంటి మందు బాటిల్ పట్టుకుని అలా స్టేజ్‌పైకి రాగానే మనో చెవిలో రాకేష్ మాస్టర్ గురించి చెప్పింది రోజా. జబర్దస్త్ ప్రోగ్రామ్‌పై కూడా కొన్ని రోజులుగా కామెంట్ చేస్తున్నాడు రాకేష్. దాంతో జబర్దస్త్ కమెడియన్స్ కూడా రాకేష్‌ను టార్గెట్ చేసారు.
హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)
హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ (hyper aadi rakesh master)

జప్ఫా అంటూ స్కిట్ అంతా రచ్చ రచ్చ చేసాడు చలాకీ చంటి. ముఖ్యంగా భాస్కర్, సుధాకర్‌ను తిడుతూ చంటి చేసిన పర్ఫార్మెన్స్ ఫుల్లుగా వర్కవుట్ అయింది. ఏదేమైనా కూడా రాకేష్ మాస్టర్ స్పూఫ్ మాత్రం బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఇదివరకు హైపర్ ఆది కూడా రాకేష్ మాస్టర్‌ను అనుకరించాడు. అప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆయన్ని బండ బూతులు తిట్టాడు రాకేష్. మరిప్పుడు చంటి పరిస్థితి ఏంటో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు