జబర్దస్త్ సాయి ప్రియాంక..! ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ జబర్దస్త్ సాయి తేజ అంటే చాలా మంది గుర్తు పడతారు. ఇద్దరూ ఒక్కటే.. సాయితేజ అలియాస్ సాయి ప్రియాంక అలియాస్ పింకీ..! పూర్తిగా అమ్మాయిగా మారిన తర్వాత సాయి పింకీకి ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. దాదాపు ఏడాది పాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్న పింకీ.. మళ్లీ తన టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. జబర్దస్త్ బ్యాచ్‌తో సందడి చేస్తోంది.
జబర్దస్త్ షోకు పోటీగా జీ తెలుగులో 'అదిరింది' షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోకు యాంకర్‌గా రవి, జడ్జిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఈ కామెడీ షోలో .. జబర్దస్త్ కామెడీలో పనిచేసిన టీమ్ లీడర్స్‌నే తీసుకున్నారు. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర.. ప్రస్తుతానికి ఈ నలుగురూ 'అదిరింది' షోలో టీమ్ లీడర్స్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే స్కిట్స్‌కు సంబంధించి రిహార్సల్స్ కూడా బయటికొచ్చాయి. అందులో నరేష్, నెమలి రాజు, తన్మయ్, కొమరం సహా చాలా మంది జబర్దస్త్ నటులు కనిపించారు. వీరితో పాటు సాయి పింకీ కూడా 'అదిరింది'లో నటిస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమే టిక్ టాక్ ద్వారా వెల్లడించింది.
జబర్దస్త్‌లో ఒకప్పుడు చాలా స్కిట్స్ చేసిన సాయితేజ.. ప్రస్తుతం ఆ షోకు దూరంగా ఉంది. లేడీ గెటప్స్‌తో పాపులరైన సాయితేజ.. ఆ తర్వాత నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని యువతిగా మారాడు. తన పేరును ప్రియాంక సింగ్‌గా మార్చుకొని.. ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పింకీ.. అభిమానులతో టచ్‌లో ఉంటూ సినిమాలు, బుల్లి తెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జీ తెలుగులో గుండమ్మ కథ సీరియల్లో నటిస్తున్న పింకీ.. తాజాగా అదిరిందిలోనూ ఛాన్స్ కొట్టేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.