రష్మీ ట్వీట్‌పై రచ్చ చేస్తున్న నెటిజన్స్.... ఆవేదనలో జబర్దస్త్ బ్యూటీ

ఇవాళ తాజాగా మరో వ్యక్తి రష్మీ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశాడు. దీనిపై జబర్దస్త్ బ్యూటీ కూడా బాగానే రిప్లై ఇచ్చింది.

news18-telugu
Updated: November 10, 2019, 11:56 AM IST
రష్మీ ట్వీట్‌పై రచ్చ చేస్తున్న నెటిజన్స్.... ఆవేదనలో జబర్దస్త్ బ్యూటీ
జబర్దస్త్ బ్యూటీ రష్మీ
news18-telugu
Updated: November 10, 2019, 11:56 AM IST
అయోధ్య తీర్పు నేపథ్యంలో జబర్దస్త్ బ్యూటీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఆమె అభిమానులంతా రష్మీ ట్వీట్‌కు లైకులు కొడుతుంటే..కొందరు మాత్రం అడ్డంగా వాదిస్తున్నారు. అయోధ్య తీర్పు రాగానే... ‘జై శ్రీ రామ్ ’ అంటూ రష్మీ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. దీంతో రష్మీ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఇలాంటి ట్వీట్స్ పెట్టే ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని మొత్తం చదవాలన్నాడు.మీ ఉద్దేశం ప్రకారం... అక్కడ ముస్లీంలు బాబ్రీ మసీదు కట్టి తప్పు చేశారా అంట ప్రశ్నించాడు. దీనికి రష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. మీలాంటివాళ్లు అనవసరంగా ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేస్తారని మండిపడింది.

దీపావళి సమయంలో క్రాకర్స్‌ను కాల్చొద్దని చెబితే... నాపై హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారని ఆరోపించింది. ఇప్పుడేమో ఆర్ఎస్ఎస్ అనుకూలవాదినని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బక్రీద సమయంలో కూడా జంతువుల్ని హింసంచకూడదని తాను ట్వీట్ చేసినట్లు పేర్కొంది. తాను ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చింది.అయితే ఆ గొడవ ఈరోజు కూడా కొనసాగుతోంది. ఇవాళ తాజాగా మరో వ్యక్తి రష్మీ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశాడు.

‘మీరు మీ అమాయకత్వం నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? మీ ట్వీట్‌ని ఉద్దేశించి ఎవరైనా వ్యాఖ్యానించినట్లయితే మీ నుంచి సమాధానం పొందడం కోసమేనా? సెలబ్రిటీ హోదా దాటి అలాంటి వాళ్లకు రిప్లై ఇవ్వడం వల్ల ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో మీరే ఫేమస్ చేస్తున్నారు. మతపరమైన నినాదాలు మాత్రం ఇవ్వొద్దని మాత్రమే నేను మీకు చెబుతుాను అంటూ ఓ నెటిజన్ రష్మీకి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను కూడా కోడ్ చేస్తూ రష్మీ రిప్లై ఇచ్చింది. ‘ఓ గాడ్ నహీ బేటా... బోలో జై శ్రీ రామ్ ’ అంటూ రష్మీ ఇవాల మరో ట్వీట్ పెట్టింది.  మొత్తం మీద అయోధ్యపై రష్మీ స్పందన సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతోంది.

Loading...






First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...