Home /News /movies /

JABARDASTH BEAUTY RASHMI GAUTAM REQUEST VIZAG PEOPLE TO SUPPORT VISAKHAPATNAM IN SWACHH SURVEKSHAN 2020 SK

విశాఖకే రష్మీ గౌతమ్ ఓటు.. మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి

రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్

విశాఖపట్నానికే తన ఓటని.. అందరూ విశాఖ నగరానికి మద్దతు తెలపాలని కోరింది. విశాఖపట్నం వాసిగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని అభిప్రాయపడింది రష్మీ.

    జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు అప్పుడప్పుడూ సామాజిక అంశాలపైనా స్పందిస్తుంది. తాజాగా విశాఖపట్నం నగరానికి సంబంధించి ట్విటర్‌లో ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది రష్మీ గౌతమ్. ఎవరైనా ఒకసారి విశాఖవాసి ఐతే ఎప్పటికీ విశాఖవాసిగానే ఉంటారని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వైజాగే తన సొంత ఇళ్లని స్పష్టం చేసింది జబర్దస్త్ బ్యూటీ.

    ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 పోటీల్లో విశాఖపట్టణాన్ని నెంబర్ వన్‌గా నిలపాలని వైజాగ్ వాసులకు విజ్ఞప్తి చేసింది రష్మీ. విశాఖపట్నానికే తన ఓటని.. అందరూ విశాఖ నగరానికి మద్దతు తెలపాలని కోరింది. విశాఖపట్నం వాసిగా ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని అభిప్రాయపడింది రష్మీ.
    స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020 లీగ్‌లో దేశవ్యాప్తంగా 4,370 నగరాలు పోటీ పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీకి మొత్తం ఆరు వేల మార్కులు కేటాయించి 4 కేటగిరీలుగా విభజించారు. ఒక్కో కేటగిరీలో 1,500 మార్కులు చొప్పున కేటాయించారు. జనవరి 4 నుంచి ప్రారంభమైన ఈ లీగ్ జనవరి 31 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన ప్రజలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌, ట్విటర్, స్వచ్ఛతా యాప్‌, 1969 ఫోన్‌కాల్‌, ఓటీపీ పోర్టల్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు ఓట్ల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Anchor rashmi gautam, Swachh Survekshan, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు