జబర్దస్త్ భామ అనసూయ... ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ అనసూయ ట్వీట్ చేసింది. అనిల్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ‘ హ్యాపీ బర్త్‌డే అన్నీ.... మనం కలిసి మరిన్ని కొత్త ఫోటోలు దిగాల్సిన అవసరం ఉంది. మీకు మరిన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అంటూ జబర్దస్త్ భామ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తీస్తున్నారు. పటాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అనిల్. ఆ తర్వత వరుసుగా సుప్రీమ్, ఎఫ్2, రవితేజతో రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ సినిమా తీశాడు. అనిల్ ఇప్పటివరకు తీసిని నాలుగు సినిమాలు కూడా మంచి హిట్ టాక్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా సంక్రాంతికి విడుదల చేసేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నాడు.
Happy birthday Aniiiiiilllll!!!! We need to click new pics!! 🙄 @AnilRavipudi Wishing you more and more Blockbusters, Happiness and Peace!!🥳🥰🤗 https://t.co/11UV0UXxog
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.