ఈటీవీలో వచ్చే కామెడీ షో 'జబర్దస్త్' తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఏవో కారణాల వల్ల ఈ షో నుండి నాగబాబు బయటకు వెళ్లిపోయాడు. దీంతో జబర్దస్త్ షో రేటింగ్స్ పడిపోతాయని అనుకున్నారు.. ఆ షో అభిమానులు. ఎప్పటినుండో రోజా, నాగబాబులు జడ్జ్‌లుగా ఉంటూ.. ఆ షోను చాలా పాపులర్ చేశారు. దీంతో ఈ షో అభిమానులు ఈ జంటకు.. వారి మాటలకు అలవాటు పడ్డారు. కానీ కొన్ని కారణాలు వల్ల నాగబాబు ఈ షో నుండి బయటకు రావడంతో రేటింగ్స్ పడిపోతాయని అందరూ భావించారు. అనుకున్న విధంగానే కొన్ని రోజులు ఈ కామెడీ షోకు సరైన జోడి లేక ఇబ్బంది పడింది. అయితే టీమ్ లీడర్స్ టాలెంట్.. వారు వేసే స్కిట్స్ బాగుండడంతో మళ్లి జబర్దస్త్ షో ట్రాక్‌లోకి వచ్చింది. దీనికి తోడు రోజా కూడా షో మళ్లి పుంజుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దీంతో 'జబర్దస్త్' పూర్వ వైభవాన్ని సంతరించుకుని టీఆర్పీ రేటింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు అదిరింది షోకు మొత్తం తానై చూసుకుంటూ షోకు కావాల్సిన గ్లామర్‌ను తన వంతు అందజేస్తున్నాడు. అదిరింది కొత్త ప్రోగ్రాం కావడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఏదో మిస్ అవ్వడంతో పాటు ఆ మ్యాజిగ్ రిపీట్ అవ్వట్లేదు. అందులో భాగంగా యూనిట్ ఊహించినంత రేటింగ్స్ మాత్రం రావట్లేదని టాక్. ఆ షోలో ఒక 'గల్లీ బాయ్స్' స్కిట్స్ తప్పితే మిగిలివి అంతంతమాత్రమే అంటున్నారు నెటిజన్స్.
కాగా తాజాగా ఈ షోలో యాంకరింగ్ చేస్తోన్న సమీరా షరీఫ్‌ను తొలగించి కొత్త వారితో యాంకరింగ్ చేయిస్తున్నారు. చూడాలి మరి 'జబర్దస్త్'ను బీట్ చేసేలా మెగా బ్రదర్ నాగబాబు అదిరిందిలో మున్ముందు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురానున్నారో.. అయితే ప్రస్తుతానికి మాత్రం జబర్దస్త్ రోజా అధ్వర్యంలో మాంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Nagababu