Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 6, 2020, 10:36 PM IST
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ కామెడీ షో నుంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్‌లో అవినాష్ కూడా ఉన్నాడు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. ఎందుకంటే ఈ షో కోసం ఆ షోను వదిలేసాడు కాబట్టి. జబర్దస్త్‌ను కాదని బిగ్ బాస్‌లోకి అడుగు పెడితే.. మళ్లీ ఇక్కడ నువ్వు అడుగు పెట్టలేవంటూ కండీషన్ పెట్టినా కూడా కఠినమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు అవినాష్. షోను వదిలేయడానికి ఫిక్సయ్యాడు. బిగ్ బాస్‌లోకి వస్తున్నాడంటే జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చి వస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు కానీ తెగదెంపులు చేసుకుని వచ్చాడని ఈ మధ్యే అర్థమైంది ప్రేక్షకులకు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మరో 8 వారాల్లో అయిపోతుంది. అందులో అవినాష్ ఎంతవరకు ఉంటాడో క్లారిటీ లేదు. చివరి వరకు ఉన్నా కూడా మరో 40 రోజుల్లో బిగ్ బాస్‌కు ఫుల్ స్టాప్ పడుతుంది. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి.. జబర్దస్త్ షోలోకి నో ఎంట్రీ కాబట్టి మరెక్కడికి వెళ్తాడు అనే అనుమానాలు అందర్లోనూ ఉన్నాయి. దీనికి సమాధానం ముందే ఆలోచించుకున్నాడు అవినాష్.

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
బిగ్ బాస్‌లోకి వచ్చే ముందే తను మరో షోతో కమిట్ అయి వచ్చాడని.. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ కావడానికి పావులు కదుపుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అదేదో కాదు జబర్దస్త్‌కు పోటీగా మొదలు పెట్టిన బొమ్మ అదిరింది. అందులోనే అవినాష్ ఎంట్రీ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అక్కడ జబర్దస్త్ మాజీ జడ్జి నాగబాబు ఉన్నాడు. ఆయన చాలా రోజుల నుంచి కూడా జబర్దస్త్ నుంచి ఎవరొచ్చినా అక్కడ తీసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ అప్పుడు ఆయనతో పాటు వెళ్లారు. అయితే ఆర్పీ దర్శకుడు కావడంతో కామెడీ షోను వదిలేసాడు.

నాగబాబు (Twitter/Photo)
వాళ్లతో పాటే ధన్‌రాజ్, వేణు లాంటి వాళ్లు అక్కడ తేలారు. ఇప్పుడు అవినాష్ కూడా బొమ్మ అదిరిందిలోకి వెళ్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆ ధైర్యంతోనే జబర్దస్త్ వదిలేసి మరీ బిగ్ బాస్‌కు వెళ్లాడంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్‌కు ఆయన 10 లక్షలు ఫైన్ కూడా కట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఏదేమైనా కూడా బిగ్ బాస్ విషయంలో మల్లెమాలతో అవినాష్‌కు అయితే చిన్నసైజ్ గొడవ అయితే జరిగిందనేది కాదనలేని వాస్తవం. మరి దీనికి ప్రతిఫలం ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 6, 2020, 10:36 PM IST