Home /News /movies /

JABARDASTH AVINASH MARRIAGE ON CARDS AND HIS WEDDING NEWS SHARED IN BIGG BOSS 4 FINALE STAGE PK

Jabardasth Avinash: పెళ్లి కొడుకు అవుతున్న అవినాష్.. అమ్మాయి ఎవరో తెలుసా..?

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth Avinash: 2020లో పెళ్లి బాజాలు కంటిన్యూగా మోగుతూనే ఉన్నాయి. వరసగా సెలబ్రిటీస్ అంతా ఇంటి వాళ్లు అవుతూనే ఉన్నారు. ఎప్పట్నుంచో సింగిల్ ఉన్న వాళ్లు ఈ ఏడాది మింగిల్ అయిపోయారు. తమకు కావాల్సిన జోడీని వెతికారు.

2020లో పెళ్లి బాజాలు కంటిన్యూగా మోగుతూనే ఉన్నాయి. వరసగా సెలబ్రిటీస్ అంతా ఇంటి వాళ్లు అవుతూనే ఉన్నారు. ఎప్పట్నుంచో సింగిల్ ఉన్న వాళ్లు ఈ ఏడాది మింగిల్ అయిపోయారు. తమకు కావాల్సిన జోడీని వెతికారు. తాజాగా మరొకరు కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆయనెవరో కాదు జబర్దస్త్ అవినాష్. ఇప్పుడు మనోడు బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనను తాను ప్రేక్షకులకు కొత్తగా చూపించుకున్నాడు ఈ కమెడియన్. ఫినాలేలో చిరంజీవి వచ్చినపుడు ఏకంగా ఈయనను రాజబాబుతో పోల్చాడు. అంత గొప్ప కమెడియన్ నీలో ఉన్నాడంటూ చిరు చెప్పేసరికి గాల్లో ఉన్నాడు అవినాష్. బిగ్ బాస్ లో దాదాపు 90 రోజులు ఉన్న అవినాష్.. అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిందుకున్నాడు. అయితే ఇన్ని రోజుల ప్రయాణంలో ఈయన పెళ్లి గురించి చాలా టాపిక్స్ నడిచాయి. ముఖ్యంగా ఈయనకు పిల్లనెవరూ ఇవ్వరు అంటూ నాగార్జున కూడా చాలా కామెడీ చేసాడు. అవన్నీ పక్కనబెడితే అరియానాతో మనోడు నడిపిన కథ కూడా బాగానే పాపులర్ అయింది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది.. కచ్చితంగా ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సమాధానం చెప్తున్నాడు అవినాష్.

bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash marriage,bigg boss 4 telugu avinash ariyana marriage,bigg boss 4 telugu avinash ariyana love story,jabardasth avinash ariyana getting married,avinash ariyana marriage,telugu cinema,jabardasth avinash skits,జబర్దస్త్ అవినాష్,బిగ్ బాస్ అవినాష్ అరియానా పెళ్లి,జబర్దస్త్ అవినాష్ పెళ్లి,అవినాష్ అరియానా పెళ్లి
అవినాష్ అరియానా (Avinash Ariyana)


అరియానా ఎప్పటికీ తన జీవితంలో ఉంటుందని చెప్పాడు ఈయన. మరోవైపు అరియానా కూడా ఇదే చెప్తుంది. ఫినాలే ఎపిసోడ్‌లో తన పెళ్లి గురించి కూడా ఓపెన్ అయిపోయాడు జబర్దస్త్ కమెడియన్. నాగార్జున అడిగిన వెంటనే తన పెళ్లి గురించి చెప్పాడు ఈయన. 2021 సమ్మర్‌లో తాను కూడా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పేసాడు. అప్పుడు ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తావ్ అంటే ఏదో ఒకటి పెట్టుకుని చేసుకుంటాను సర్ అంటూ సమాధానమిచ్చాడు. అవినాష్ తీరు చూస్తుంటే ఇప్పటికే అమ్మాయిని కూడా చూసుకునే ఉంటాడని చెప్తున్నారు అభిమానులు.
bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash marriage,bigg boss 4 telugu avinash ariyana marriage,bigg boss 4 telugu avinash ariyana love story,jabardasth avinash ariyana getting married,avinash ariyana marriage,telugu cinema,jabardasth avinash skits,జబర్దస్త్ అవినాష్,బిగ్ బాస్ అవినాష్ అరియానా పెళ్లి,జబర్దస్త్ అవినాష్ పెళ్లి,అవినాష్ అరియానా పెళ్లి
అరియానా అవినాష్ (Ariyana Avinash)

మరోవైపు అమ్మాయి ఎవరో కాదు అరియానానే అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో దాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటే తప్పేముంది అంటూ ఇద్దరి అభిమానులు అడుగుతున్నారు. మరోవైపు అవినాష్ కూడా తను ఎక్కడికి వెళ్లినా కూడా అరియానా గురించే అడుగుతున్నారని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే కొంపదీపి అరియానానే పెళ్లి చేసుకుంటాడేమో అనిపిస్తుంది కూడా. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు