Home /News /movies /

JABARDASTH AVINASH GETS SHOCKED WITH BIGG BOSS HOST NAGARJUNA AKKINENI GIFT PK

Bigg Boss 4 Avinash: అవినాష్‌కు షాక్ ఇచ్చిన నాగార్జున.. ఎలిమినేషన్ తర్వాత కూడా..

నాగార్జున అవినాష్ (Nagarjuna Avinash)

నాగార్జున అవినాష్ (Nagarjuna Avinash)

Bigg Boss 4 Avinash: ఒక్కసారి కానీ బిగ్ బాస్ హోస్ట్ చేసారంటే చాలు.. ఇక ఆ షోతో.. అందులో ఉన్న కంటెస్టెంట్స్‌తో ఏదో తెలియని అనుబంధం వాళ్లకు వచ్చేస్తుంది. తొలి సీజన్ తర్వాత ఎన్టీఆర్ ఇప్పటికీ వాళ్ళతో అప్పుడప్పుడూ టచ్‌లో ఉంటాడు.

ఒక్కసారి కానీ బిగ్ బాస్ హోస్ట్ చేసారంటే చాలు.. ఇక ఆ షోతో.. అందులో ఉన్న కంటెస్టెంట్స్‌తో ఏదో తెలియని అనుబంధం వాళ్లకు వచ్చేస్తుంది. తొలి సీజన్ తర్వాత ఎన్టీఆర్ ఇప్పటికీ వాళ్ళతో అప్పుడప్పుడూ టచ్‌లో ఉంటాడు. దాంతో పాటు నాని కూడా సీజన్ 2 కంటెస్టెంట్స్ అందరికీ దగ్గరగానే ఉన్నాడు. ఇప్పుడు సీజన్ 3, 4 లలో కూడా నాగార్జున ఇదే చేస్తున్నాడు. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు. వాళ్లు ఉన్నా ఎలిమినేట్ అయినా కూడా అదే బంధం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ 4 విషయంలో అవినాష్‌ను ప్రత్యేకంగా అభిమానించాడు నాగార్జున. అతడు హౌజ్‌లో ఉన్నపుడు బాగా ఎంకరేజ్ చేసాడు. అందరితో కంటే వీకెండ్‌లో ఎక్కువ సేపు అవినాష్‌తోనే టైమ్ పాస్ చేసేవాడు నాగార్జున. ఈ జబర్దస్త్ కమెడియన్‌కు ఏకంగా ఎంటర్‌టైనర్ ఆఫ్ హౌజ్ అంటూ బిరుదు ఇచ్చేసాడు. కేవలం ఈ సీజన్ మాత్రమే కాదు ఇప్పటి వరకు జరిగిన నాలుగు
సీజన్స్‌లో కూడా అవినాష్ కంటే ఎంటర్‌టైనర్ ఎవరూ లేరంటూ తేల్చేసాడు నాగార్జున. అందుకే అవినాష్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తర్వాత కూడా అతడిని గుర్తు పెట్టుకున్నాడు.
నాగార్జున అవినాష్ (Nagarjuna Avinash)

ఇప్పుడు అదిరిపోయే షాక్ ఇచ్చాడు. మన్మథుడు ఇచ్చిన షాక్‌తో అవినాష్‌కు నోట మాట కూడా రావడం లేదు. అప్పట్లో ఓ వీకెండ్ సమయంలో హోస్టింగ్ చేస్తున్న నాగార్జునతో అవినాష్ ఓ మాట అన్నాడు. సర్ మీ షర్ట్ కెవ్వు కేక.. ఈ చొక్కాలో చించేసారు సర్ అంటూ పొగిడేసాడు అవినాష్. ఆ మాటలను గుర్తు పెట్టుకున్న నాగార్జున.. ఇప్పుడు అదే చొక్కాను అవినాష్‌కు బహుమతిగా పంపించాడు. అదే షర్ట్ తాను వేసుకుని సోషల్ మీడియాలో విషయమంతా పోస్ట్ చేసాడు అవినాష్. అప్పుడెప్పుడో చెప్పిన మాట గుర్తు పెట్టుకుని నాగార్జున గారు నాకు ఈ షర్ట్ పంపించారు అంటూ తెలిపాడు అవినాష్. దాంతో ఫ్యాన్స్ అంతా నాగార్జున తీరుతో ఖుషీ అవుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు