HOME » NEWS » movies » JABARDASTH AVINASH AFRAID OF NOMINATIONS IN BIGG BOSS 4 TELUGU AND HE IS FACING PROPERLY PK

Jabardasth Avinash: అయ్యా అవినాష్.. నామినేషన్ అంటే అంత భయమేంది సామీ నీకు..?

Jabardasth Avinash: ఇప్పుడు ఇదే అడుగుతున్నారు అవినాష్‌ను. బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చిన తర్వాత ముందు అలవాటు పడాల్సింది అక్కడి వాతావరణానికి కాదు వీకెండ్‌లో వచ్చే నామినేషన్‌కు. అక్కడ నామినేషన్ అనేది కామన్. వీకెండ్ వచ్చేసరికి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 24, 2020, 4:06 PM IST
Jabardasth Avinash: అయ్యా అవినాష్.. నామినేషన్ అంటే అంత భయమేంది సామీ నీకు..?
జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)
  • Share this:
ఇప్పుడు ఇదే అడుగుతున్నారు అవినాష్‌ను. బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చిన తర్వాత ముందు అలవాటు పడాల్సింది అక్కడి వాతావరణానికి కాదు వీకెండ్‌లో వచ్చే నామినేషన్‌కు. అక్కడ నామినేషన్ అనేది కామన్. వీకెండ్ వచ్చేసరికి అంతా నామినేట్ అవుతూనే ఉంటారు. ఏ ఒక్కరు అక్కడ మినహాయింపు కాదు. 12 వారాల్లో ఇప్పటి వరకు 10 సార్లు నామినేట్ అయ్యాడు అభిజీత్. దీన్నిబట్టి ఆయన ఎంత స్ట్రాంగ్ అనేది అర్థమవుతుంది. ఇదిలా ఉంటే అవినాష్ మాత్రం నామినేషన్ అంటేనే భయపడుతున్నాడు. నామినేట్ అయితే చాలు భయపడుతున్నాడు.. ఫ్రస్టేట్ అవుతున్నాడు ఈయన. ఎలా మాట్లాడాలో.. ఏం మాట్లాడాలో కూడా మరిచిపోతున్నాడు. కంట్రోల్ తప్పిపోతున్నాడు అవినాష్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నపుడు అవినాష్ గురించి ఎవరికీ ఏం తెలియదు. ఆయన కేవలం కామెడీ చేస్తాడని మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుంది. దాంతో పాటు వ్యక్తిగతంగా అవినాష్ ఎలా ఉంటాడు.. ఎలాంటి వాడు అనేది కూడా అర్థమవుతుంది.
jabardasth avinash,jabardasth avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash borther ajay,bigg boss 4 telugu avinash jabardasth no entry,jabardasth avinash emotional game,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ జబర్దస్త్‌కు నో ఎంట్రీ,అవినాష్‌కు జబర్దస్త్ ఎంట్రీ ఉందంటున్న అజయ్
జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)


ముఖ్యంగా పర్సనల్ విషయాలను కూడా అక్కడ బాగానే చర్చిస్తున్నాడు అవినాష్. అయితే లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో గురించి కూడా కొన్ని అనవసర వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. పైగా బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత తనపై సింపతీ పెరిగిపోయేలా మాట్లాడుతున్నాడు. అక్కడ గేమ్ ప్లాన్ కూడా అలాగే కనిపిస్తుంది. మాట్లాడితే తన కుటుంబం కష్టాల్లో ఉంది.. తాను ఆత్మహత్య చేసుకునే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. దయచేసి తనను ఎలిమినేట్ చేయొద్దు.. నామినేట్ చేయొద్దు అంటూ వేడుకుంటున్నాడు. ఏకంగా కెమెరా ముందుకొచ్చి ఏడ్చేస్తున్నాడు. అయితే ఇదంతా చూసిన ఆడియన్స్ కచ్చితంగా నాటకాలే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు.
jabardasth avinash,jabardasth avinash bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash borther ajay,bigg boss 4 telugu avinash jabardasth no entry,jabardasth avinash emotional game,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ జబర్దస్త్‌కు నో ఎంట్రీ,అవినాష్‌కు జబర్దస్త్ ఎంట్రీ ఉందంటున్న అజయ్
అవినాష్ అరియానా (Avinash Ariyana)

ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా పక్కనబెడితే మరీ ఎమోషనల్ డ్రామాలు ఎక్కువైపోతున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. కచ్చితంగా ఇలా ఏడ్చి ఎమోషనల్ బ్లాక్‌‌మెయిల్ చేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుందని అంతా అంటున్నారు. పైగా జబర్దస్త్ నుంచి తనను పంపించేసారని.. అక్కడ తనకు ఎంట్రీ కూడా లేదని చెప్పుకుంటున్నాడు అవినాష్. మరోవైపు ఆయన తమ్ముడు అజయ్ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇస్తున్న కొన్ని ఇంటర్వ్యూలలో అవినాష్‌ను జబర్దస్త్ నుంచి ఎవరూ తప్పించలేదని.. కావాలనే తను మళ్లీ రావచ్చంటూ కామెంట్ చేసాడు. ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా మోనాల్‌తో పాటు బిగ్ బాస్‌పై కూడా నోరు జారాడు అవినాష్.

ఇక్కడ గేమ్ ఆడేవాళ్ల కంటే కూడా డ్రామాలు చేసే వాళ్లకే వ్యాల్యూ ఎక్కువ అంటూ నోరు జారేసాడు అవినాష్. 12 వారాల్లో ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే నామినేట్ అయ్యాడు అవినాష్. దానికి కూడా భయపడుతున్నాడు. నామినేట్ అయితే ఎలిమినేట్ అయిపోతానేమో అనే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. తనను తాను వీక్ అని ఆయనే చెప్పుకుంటున్నాడంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ భయంతో ఈ వారం అవినాష్ ఉంటాడో.. ఎలిమినేట్ అవుతాడో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: November 24, 2020, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading