Jabardasth Ram Prasad: జబర్దస్త్ టీమ్ లీడర్‌లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాంప్రసాద్.. ఆ అమ్మాయితో అలా అంటూ?

Jabardasth Ram Prasad

Jabardasth Ram Prasad: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు మంచి కమెడియన్ గా గుర్తింపు పొంది వెండితెరపై కూడా మెప్పిస్తున్నారు.

  • Share this:
    Jabardasth Ram Prasad: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు మంచి కమెడియన్ గా గుర్తింపు పొంది వెండితెరపై కూడా మెప్పిస్తున్నారు. ఇందులో ఎంతో మంది మామూలు వ్యక్తులు స్టార్ కమెడియన్ గా నిలువగా అందులో ఒకరు ఆటో రాంప్రసాద్ అని చెప్పవచ్చు. ఈయన వేసే ఆటో పంచులతో ఆటో రాంప్రసాద్ గా మారాడు. ఇదిలా ఉంటే రాంప్రసాద్ తాజాగా టీమ్ లీడర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    జబర్దస్త్ లో ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంప్రసాద్.. గెటప్ శీను, సుడిగాలి సుధీర్, సన్నీ వాళ్లతో కలిసి తెగ పంచ్ లు వేస్తూ బాగా ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా తన టీమ్ కు తానే స్క్రిప్టు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు రాంప్రసాద్. ఇక పారితోషికం విషయంలో కూడా ఈయనకు టీమ్ లీడర్ లతో సమానంగా ఉందని తెలుస్తుంది.

    ఇదిలా ఉంటే వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. అందులో హైపర్ ఆది టీమ్ లో ఆటో రాంప్రసాద్ గెస్ట్ గా వచ్చి తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కొరియోగ్రాఫర్ పండు కూడా గెస్ట్ గా రాగా ఇందులో వీరు ముగ్గురు తెల్ల పంచెలు, నల్ల చొక్కలు వేసుకుని ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరి ముగ్గురు తో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చారు. ఇక వాళ్లతో సరదాగా ఉండగా..



    హైపర్ ఆది వెంటనే.. నిన్ను వడివేలు అనే గ్యాప్ లో వాడు తడిమేస్తున్నాడు చూసావా? ఏరా చేయి తీసేయ్ అంటూ రామ్ ప్రసాద్ ని అంటాడు. ఇక హైపర్ ఆది కూడా మరో అమ్మాయి పై చేయి వేసి ఉంచగా.. వెంటనే రామ్ ప్రసాద్.. ఏదైనా టీమ్ లీడర్లకు కొంచెం ఎక్కువగా కంఫర్ట్స్ ఉంటాయి కదా అని షాకింగ్ కామెంట్ చేశాడు. ఇక దీంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.
    Published by:Navya Reddy
    First published: