Home /News /movies /

JABARDASTH AUTO RAM PRASAD GIVES CLARITY ON VULGARITY IN JABARDASTH COMEDY SHOW SK

జబర్దస్త్‌ యాంకర్స్ డ్రెస్సింగ్‌పై ఆటో రాంప్రసాద్ కామెంట్స్

ఆటో రాంప్రసాద్

ఆటో రాంప్రసాద్

తనను 'ఆటో' అని పిలిస్తేనే పలుకుతానని చెప్పారు రాంప్రసాద్. అంతేతప్ప ఆటిట్యూడ్ చూపించే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు.

    జబర్తస్త్ కామెడీ షో.. తెలుగు బుల్లితెర సంచలనం..! టీఆర్పీలో టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. మరే షోకు సాధ్యంకాని రికార్డులు సాధిస్తోంది. ఆరున్నరేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ ఖతర్నాక్ షో.. ఎంతో మంది యంగ్ కమెడియన్లకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఐతే జబర్దస్త్‌ను ప్రజలను ఎంతగా ఆదరిస్తున్నారో... అంతే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, అడల్డ్ పంచ్‌లు, యాంకర్ల పొట్టి డ్రెస్సులతో.. జబర్దస్త్ బూతు షోగా మారిందని ఎన్నో విమర్శలున్నాయి. వీటికి జబర్దస్త్ స్టార్స్ చాలా సార్లు సమాధానం చెప్పారు. తాజాగా జబర్దస్త్ స్రిప్ట్ రైటర్, కమెడియన్ ఆటో రాంప్రసాద్ సైతం ఈ అంశంపై మాట్లాడారు.

    యాంకర్లు పొట్టి దుస్తులు వేసుకుంటున్నారనని ఆరోపించడం సరికాదన్నారు రాంప్రసాద్. జబర్దస్త్‌ షోకు కామెడితో పాటు యాంకర్స రష్మి, అనసూయ, రోజా గ్లామర్ ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తమకు ఎప్పుడూ తప్పనిపించలేదని స్పష్టంచేశారు. జబర్దస్త్‌లో వల్గారిటీ ఉందన్న ఆరోపణలను తానైతే ఒప్పుకోనని చెప్పారు. ఇక ఫన్ కోసమే.. ఆడియెన్స్‌ని నవ్వించేందుకే లేడీ గెటప్‌లు వేస్తామని క్లారిటీ ఇచ్చారు ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ స్టేజిపై మహిళలపై సెటైర్లు వేసి ఫిజికల్‌గా టచ్‌చేస్తే ఎవరూ ఊరుకోరని.. అందుకే మగవారికే లేడీ గెటప్‌లు వేయించి కామెడీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రాంప్రసాద్.

    ఇక రాంప్రసాద్‌కు పొగరు ఎక్కువని.. ఆటిట్యూడ్ చూపిస్తారన్న ఆరోపణలకూ ఆయన సమాధానం చెప్పారు. తనకు పొగరుందన్న ప్రచారం పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు. స్కిట్‌ రాసేందుకు పెన్ను పేపర్ పట్టుకొని అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తాను తిరుగుతానని చెప్పారు. స్కిట్‌లో బాగా లీనమైనప్పుడు మాత్రమే.. ఎవరైనా పిలిస్తే పలకకపోయి ఉండొచ్చని ఆయన వెల్లడించారు. తనను 'ఆటో' అని పిలిస్తేనే పలుకుతానని చెప్పారు రాంప్రసాద్. అంతేతప్ప ఆటిట్యూడ్ చూపించే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు.
    First published:

    Tags: Auto ramprasad, Jabardasth, Jabardasth comedy show, Jabardasth ramprasad, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు