Home /News /movies /

JABARDASTH APPARAO INTERESTING COMMENTS ON RACHA RAVI MS

Jabardasth : రచ్చ రవిని పిచ్చి రవి అని ఎందుకు అనేవాళ్లు..?

రచ్చ రవి,జబర్దస్త్ అప్పారావు (File Photos)

రచ్చ రవి,జబర్దస్త్ అప్పారావు (File Photos)

Jabardasth Racha Ravi : రచ్చ రవి చిన్నతనంలోనే ఎత్తు పల్లాలను చూశారని.. మంచి జీవితాన్ని అనుభవించి.. ఒక్కసారిగా కిందకు పడిపోయాడని చెప్పుకొచ్చారు.

    జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రచ్చ రవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేశ్ చిత్రంలో నటనకు గాను రచ్చ రవికి మంచి గుర్తింపు లభించింది. వరుస సినిమా ఆఫర్ల కారణంగా జబర్దస్త్‌ను వదిలేసిన రచ్చ రవి.. షూటింగ్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చినఇంటర్వ్యూలో రచ్చ రవితో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు జబర్దస్త్ అప్పారావు. జబర్దస్త్ షోలో రచ్చ రవిని అందరూ 'పిచ్చి రవి' అని పిలవడంపై ఆసక్తికర విషయాలు చెప్పారు. రచ్చ రవి చిన్నతనంలోనే ఎత్తు పల్లాలను చూశారని.. మంచి జీవితాన్ని అనుభవించి.. ఒక్కసారిగా కిందకు పడిపోయాడని చెప్పుకొచ్చారు.దుబాయిలో ఆర్జేగా పనిచేసిన రచ్చ రవి నిజానికి ఓ మున్సిపల్ ఉద్యోగి అని.. నటన మీద ఉన్న ఆసక్తితోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనుకున్నాడని చెప్పారు.

    చిన్నతనంలోనే చాలా కష్టాలను అనుభవించి.. ఆ తర్వాత మంచి స్థాయికి వెళ్లాడని.. ఉన్నట్టుండి మళ్లీ కిందకు పడిపోవడం అతని జీవితాన్ని ఒక కుదుపుకు లోను చేసిందని చెప్పారు. చిన్న వయసులోనే చాలావరకు ప్రపంచాన్ని చూడటంతో.. ఆయనేం మాట్లాడిన వేదాంతం మాట్లాడినట్టుగా ఉంటుందని చెప్పారు.అది నచ్చక కొందరు అతన్ని పిచ్చి రవి అనడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. మేదావులనే పిచ్చివాళ్లుగా పరిగణిస్తున్న సమాజంలో రచ్చ రవిని పిచ్చి రవిగా పిలవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదని చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్న రవి.. సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Jabardasth, Jabardasth apparao, Jabardasth comey show, Racha Ravi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు