Home /News /movies /

JABARDASTH APPARAO COMMENTS ON BULLET BHASKAR AND TEAM SLB

Jabardasth: అది వాడుకొని వదిలేసే బ్యాచ్..! జబర్దస్త్‌ అప్పారావు సెన్సేషన్

Photo Twitter

Photo Twitter

జబర్దస్త్ తోనే ఫేమస్ అయిన కొందరు మాత్రం ఉన్నట్టుండి ఈ షో నుంచి బయటకు వస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ జడ్జ్ నాగబాబు మొదలు ఇప్పటికీ చాలామంది కమెడియన్లు ఈ షో నుంచి బయటకు వచ్చి వేరే కామెడీ షోస్ చేసుకుంటున్నారు.

ఎంతోమంది కమెడియన్ల భవిష్యత్ మార్చేసింది జబర్దస్త్ షో (Jabardasth Show). ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ షోతో ఎందరో కమెడియన్స్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వారి వారి టాలెంట్‌తో సినిమా అవకాశాలు కూడా పట్టేశారు. అయితే ఈ జబర్దస్త్ తోనే ఫేమస్ అయిన కొందరు మాత్రం ఉన్నట్టుండి ఈ షో నుంచి బయటకు వస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ జడ్జ్ నాగబాబు (Naga babu) మొదలు ఇప్పటికీ చాలామంది కమెడియన్లు ఈ షో నుంచి బయటకు వచ్చి వేరే కామెడీ షోస్ చేసుకుంటున్నారు. ఈ లిస్టులోనే ఉన్నాడు జబర్దస్త్ అప్పారావు (Jabardasth Appa Rao). జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన ఆయన షోపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కొందరు ఒకానొక దశలో జబర్దస్త్ నుంచి అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు టాక్ వచ్చింది. అందుకు పలు కారణాలు ఉన్నాయంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన జబర్దస్త్ అప్పారావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జబర్దస్త్ షో తెరవెనుక జరిగే కొన్ని విషయాలపై ఆయన ఓపెన్ అయ్యారు.

మొదట తనకు షకలక శంకర్ (Shakalaka Shankar) చాలా సపోర్ట్ చేశాడని, అతని వల్లనే మంచి గుర్తింపు లభించిందని చెప్పిన అప్పారావు.. ఆ తర్వాత చలాకి చంటి (Chalaki Chanti) టీమ్‌లో కూడా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. అలా వారిద్దరు తన కెరీర్‌ ఎదుగుదలలో ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత కరోనా కారణంగా కొన్ని రోజులు దూరం పెట్టి బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar) టీమ్‌లో జాయిన్ చేస్తాను అన్నారని, అయితే అతని టీమ్ లో చేయనని చెప్పానని అప్పారావు అన్నారు. బుల్లెట్ భాస్కర్ కారణంగా జబర్దస్త్ షో వదిలేయాలని అనుకోగా.. ఇంతలో రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) టీమ్‌లో వేస్తామని అన్నారని, కానీ తన పారితోషికం విషయంలో కొంత అసంతృప్తి చెందానని చెప్పారు అప్పారావు.

ఇంతలోనే వేరే ఆఫర్లు రావడంతో బయటకు రావాలని డిసైడ్ అయ్యానని, అయితే NOC కావాలని అడిగితే కనీసం ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది కూడా మేనేజ్మెంట్ కనుక్కోలేదని చెప్పారు అప్పారావు. అలా తనను అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని వదిలేశారంటూ ఎమోషనల్ అయ్యారు. గతంలో కూడా కొన్నిసార్లు జబర్దస్త్ విషయమై ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా అప్పారావు ఓపెన్ కావడంతో ఈ విషయంపై చర్చలు నడుస్తున్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: BUllet bhasker, Jabardasth, Jabardasth apparao

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు