Home /News /movies /

JABARDASTH APPA RAO REVEALED ALL SECRETS OF SHOW AND SHARED HIGHEST REMUNERATION PK

Jabardasth Appa Rao: జబర్దస్త్‌ గుట్టు విప్పిన అప్పారావు.. అత్యధిక పారితోషికం ఎవరికంటే..?

జబర్దస్త్ అప్పారావు (Jabardasth Appa Rao)

జబర్దస్త్ అప్పారావు (Jabardasth Appa Rao)

Jabardasth Appa Rao: బుల్లితెరపై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న షోలలో జబర్దస్త్ అన్నింటి కంటే ముందుంటుంది. ఇందులో నటించే వాళ్లకు కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. పేరుకు వాళ్లు కమెడియన్లు అయినా కూడా సంపాదన మాత్రం భారీగానే ఉంటుంది.

బుల్లితెరపై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న షోలలో జబర్దస్త్ అన్నింటి కంటే ముందుంటుంది. ఇందులో నటించే వాళ్లకు కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. పేరుకు వాళ్లు కమెడియన్లు అయినా కూడా సంపాదన మాత్రం భారీగానే ఉంటుంది. అలా డిమాండ్ చేస్తారు కూడా. ఇప్పుడు అందులో వచ్చే రెమ్యునరేషన్స్ గురించి అప్పారావు ఓపెన్ అయిపోయాడు. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్‌లకు లక్షల్లోనే పారితోషికాలు అందుతున్నాయని చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు కూడా చెప్పుకొచ్చారు. చంద్ర జబర్దస్త్‌లో ఉన్నంత వరకు కూడా అగ్రతాంబూలం ఆయనకే అందింది. దానికితోడు ఈ మధ్యే మరోసారి అందరికీ భారీగానే రేట్ పెంచేసారని.. డబుల్ చేసారని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి తరుణంలో జబర్దస్త్ కామెడీ షోలో కీలకంగా ఉన్న టీం లీడర్ అప్పారావు రెమ్యునరేషన్స్ గురించి ఓపెన్ అయ్యాడు. మీకు భారీగానే వస్తుందంట.. ఎంత తీసుకుంటున్నారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కాస్త తటపటాయిస్తూనే అసలు నిజాలు చెప్పాడు అప్పారావు. జబర్దస్త్ పుణ్యమా అని బాగానే సంపాదించుకుంటున్నామని.. పేరు కూడా బాగానే వచ్చిందని చెప్తున్నాడు ఈయన. ముఖ్యంగా కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ కూడా వస్తుంటాయని.. వాటిని బట్టి రేట్ కూడా ఉంటుందని చెప్పాడు అప్పారావు.

జబర్దస్త్ అప్పారావు (jabardasth apparao)
జబర్దస్త్ అప్పారావు (jabardasth apparao)


బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు ఒకరోజు జర్నీకే పోతుందని.. దాంతో దానికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు ఈయన. భాస్కర్ టీంలో ఉంటాడు అప్పారావు. ఇద్దరూ టీం లీడర్స్ అయినా కూడా భాస్కర్ ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రతీ ఈవెంట్‌లో కూడా అప్పారావు లేకుండా ఉండదు అనే పేరు అయితే తెచ్చుకున్నానని.. దానికి సంతోషంగా ఉందంటున్నాడు ఈ సీనియర్ కమెడియన్. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ తీసుకొచ్చింది ఈయనకు.

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)
సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)


ఇక పారితోషికం విషయంలో కూడా అందరికంటే ఎక్కువ కాదు కానీ అందరితో పాటుగానే భారీగా వస్తుందని ఒప్పుకున్నాడు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు తనకంటే అత్యధికంగా రెమ్యునరేషన్ వస్తుందని తెలిపాడు అప్పారావు. టీం లీడర్ కాబట్టి తనకు కూడా లక్షల్లోనే రెమ్యునరేషన్ వస్తుందని ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు అప్పారావు. ప్రస్తుతం షూటింగ్స్ తిరిగి మొదలు కావడంతో పండగ చేసుకుంటున్నారు కమెడియన్లు. లాక్‌డౌన్ సమయంలో కూడా షెడ్యూల్స్ ప్రకారం డబ్బులు మాత్రం వస్తున్నాయని.. మల్లెమాల ఆ విషయంలో పర్ఫెక్ట్ అంటున్నాడు ఈ కమెడియన్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు