చితికిపోయిన వంటలక్క... కష్టకాలంలో జబర్దస్త్..

కార్తీక దీపం, జబర్దస్త్ షోలు తెలుగులో ఎంత పాపులరో తెలియందికాదు. టీఆర్పీ రేటింగ్స్‌లో వీటికి ఎదురులేదు. అయితే అన్నికాలాలు ఒకలా ఉండవు కదా.. బండ్లు ఓడలైవుతాయి.. ఓడలు బండ్లౌతాయి.

news18-telugu
Updated: May 27, 2020, 3:18 PM IST
చితికిపోయిన వంటలక్క... కష్టకాలంలో జబర్దస్త్..
కార్తీక దీపం, జబర్దస్త్ Photo : Twitter
  • Share this:
టీవీలు చూసే తెలుగువారికి కార్తీకదీపం లేదా జబర్దస్త్ అంటే ఏమిటో ఊరికే చెప్తారు. మాటీవీలో వచ్చే కార్తీక దీపం సీరియల్ అయితే తెలుగు మహిళలు అతి ఇష్టంగా చూసే సీరియల్స్‌లో ప్రధానమైంది. దీంతో అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ మాటీవీకి వచ్చేవి. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌కు వచ్చేవి. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవట్లేదు. దీంతో ఈ షోలకు టీఆర్పీ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. కరోనా లాక్ డౌన్ ముందు ఎప్పుడైనా ఏదైనా చానెల్ లో కొత్త సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఈ రెండు షోలకూ ఆదరణ కాస్తంత తక్కువగా ఉండేది. ఇప్పుడు అంతా తలకిందులైంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నిత్యం వస్తున్న కొన్ని ఆసక్తికర సినిమాలు, వార్తలు, ప్రత్యేక కార్యక్రమాలకు టీఆర్పీ పెరిగింది. ఇదే సమయంలో సీరియల్స్, రియాల్టీ షోల షూటింగ్స్ జరగకపోవడంతో ఈ టీవీలో జబర్దస్త్ పాత ఎపిసోడ్ లు ప్రసారం అవుతుండగా, మాటీవీలో కూడా కార్తీకదీపం సీరియల్ ను రిపీట్ చేస్తున్నారు. దీంతో వీటి రేటింగ్ పడిపోయిందట. ఎప్పుడూ తొలి రెండు స్థానాల్లో ఉండే ఈ కార్యక్రమాలు కిందకు దిగాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్‌కు అనుమతిస్తే మళ్లి పుంజుకునే అవకాశం మాత్రం మెండుగా ఉంది.
Published by: Suresh Rachamalla
First published: May 27, 2020, 3:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading