జబర్దస్త్ షూటింగ్ ఆగిపోయిందా.. మల్లెమాలకు కొత్త తలనొప్పి..

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కడుపు నింపుకుంటున్నారు. కేవలం కమెడియన్లు మాత్రమే కాకుండా అందులో పని చేసే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 9:02 PM IST
జబర్దస్త్ షూటింగ్ ఆగిపోయిందా.. మల్లెమాలకు కొత్త తలనొప్పి..
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కడుపు నింపుకుంటున్నారు. కేవలం కమెడియన్లు మాత్రమే కాకుండా అందులో పని చేసే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వందల మంది దీనికోసం కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. లాక్‌డౌన్ కావడంతో ఇల్లు దాటి ఎవరూ బయటికి రావడం లేదు. ఎవరింట్లో వాళ్లు గప్ చుప్ అంటూ కూర్చున్నారు. ఇప్పటికే రష్మి గౌతమ్, శ్రీముఖి, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్లంతా వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు గెటప్ శ్రీను కూడా ఇంట్లో అంట్లు తోముకుంటూ వీడియో పెట్టాడు.
నటి రోజా (Jabardasth Comedy Show)
నటి రోజా (Jabardasth Comedy Show)

మిగిలిన వాళ్లు కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కామెడీ షో నెక్ట్స్ షెడ్యూల్ ఆగిపోయింది. ఇప్పటికే షూట్ చేసుకున్న ఎపిసోడ్స్ కూడా పూర్తి కావడంతో వచ్చే వారం తర్వాత పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. మళ్లీ పాత ఎపిసోడ్స్ ప్లే చేయాలని చూస్తున్నారు మల్లెమాల యాజమాన్యం. దాంతో పాటు ఈటీవీలో మరికొన్ని సీరియల్స్ కూడా ఆగిపోయాయి. ఇప్పటికే స్లాట్స్ నింపడానికి ఒకప్పుడు చేసిన కామెడీ షోలతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి ఈవెంట్స్ రిపీట్ వేసుకుంటున్నారు. మూడు గంటలకు పైగా వీటితోనే కవర్ చేస్తున్నారు.

రష్మీ గౌతమ్, అనసూయ Photo ; Twitter
రష్మీ గౌతమ్, అనసూయ Photo ; Twitter

ఈ క్రమంలోనే జబర్దస్త్ కూడా ప్రస్తుతానికి ఆగిపోయేలా కనిపిస్తుంది. వచ్చేవారం ప్రోమో అయితే పడింది. అంటే వచ్చే వారం వరకు జబర్దస్త్ కానీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు కానీ ఎలాంటి సమస్యా లేదు. ఎప్రిల్ తొలివారం తర్వాత రెండో వారంలో వచ్చే జబర్దస్త్ మాత్రం లేకపోవచ్చు. ప్రస్తుతం నటీనటులతో పాటు యాంకర్స్ కూడా అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. టెక్నిషియన్స్ కూడా అంతా హౌజ్ అరెస్ట్ అయిపోయారు. అందుకే జబర్దస్త్ ప్రస్తుతానికి ఆగిపోయింది. మళ్లీ ఎప్రిల్ 14 తర్వాతే కొత్త షూటింగ్.. అప్పటికీ కరోనా కంట్రోల్ కాకపోతే మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ తప్పదు. అంటే ఇంకొన్నాళ్లు పాత ఎపిసోడ్స్ చూడాల్సిందే అన్నమాట.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading