JABARDASTH ANCHORS RASHMI GAUTAM AND ANASUYA BHARADWAJ SUPPORTED GOVT DECISION OVER CHINA APPS PK
చైనా విషయంలో రష్మి గౌతమ్‌ని సమర్థించిన అనసూయ..
రష్మి గౌతమ్, అనసూయ (anasuya rashmi gautam)
Rashmi Gautam Anasuya: చైనా యాప్స్‌ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడంతో దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు దేశభక్తి చూపించడం అంటే యాప్స్..
చైనా యాప్స్‌ను ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయడంతో దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు దేశభక్తి చూపించడం అంటే యాప్స్ తీసేయడం కాదంటూ వాదిస్తున్నారు. ఏదేమైనా కూడా చైనా యాప్స్ ఇకపై ఇండియాలో ఉండవు. దీనిపై ఇప్పుడు జబర్దస్త్ యాంకర్స్ రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ కూడా తమ మనసులో మాట బయట పెట్టారు. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ అన్నీ శాశ్వతంగా రాకుండా చూసుకోవాలంటూ రష్మి చెప్తుంది.
వాళ్ల దేశం నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టి.. యాప్స్ ఇచ్చి.. వాటి నుంచే సంపాదన రాబట్టుకుంటూ మళ్లీ అదే డబ్బుతో మనపై యుద్ధం చేస్తున్నారు చైనా వాళ్లు.. అలాంటప్పుడు వాళ్ల యాప్స్ మనకెందుకు.. వద్దు పీకి పారేద్దామంటూ అనసూయ ఫైర్ అయింది. మరోవైపు రష్మి గౌతమ్ మాత్రం ఈ విషయంపై కాస్త ఆలోచనాత్మకంగా స్పందించింది. చైనా యాప్స్‌ను ఇండియన్ గవర్నమెంట్ నిషేధించడానికి సమర్థిస్తూనే.. ఒకవేళ భవిష్యత్తులో వాళ్లు మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నించినా కూడా కంటెంట్‌లో ఫిల్టర్ అనేది ఉండాల్సిందే అని చెప్తుంది.
I wish the ban is permanent But even if they do manage to come back They need to filter content Can't have animal killing or insensitive abuse stuff on it That had become the new normal for views https://t.co/xlFIatMYN1
ముఖ్యంగా జంతు హింసతో పాటు కొన్ని సున్నితమైన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది రష్మి. ఈమె చెప్పిన దానికి అనసూయ ఓకే అంటూనే.. అసలు చైనా యాప్స్ అనేది మళ్లీ తిరిగి రాకూడదని కుండ బద్ధలు కొట్టేసింది. మన దేశానికి వచ్చి.. మన సొమ్ము తింటూ మనపైనే యుద్ధం చేస్తున్న చైనాను మనమెందుకు ప్రోత్సహించాలంటూ ప్రశ్నించింది. బ్యాన్ చైనీస్ ప్రాడక్ట్స్ ఫరెవర్ అంటూ రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ జబర్దస్త్ భామల సోషల్ మీడియా చర్చ వైరల్ అవుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.