రష్మి, సుధీర్, ప్రదీప్, అనసూయ.. అంతా అక్కడ బిజీ..

అక్కడ బిజీ అయిపోయిన జబర్దస్త్ టీం మెంబర్స్

Rashmi Anasuya: రోజూ బయట తిరిగిన ప్రాణాలకు ఒక్కసారిగా ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొట్టక తప్పదు. అందుకే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లతో పాటు యాంకర్స్ రష్మి గౌతమ్, అనసూయ, ప్రదీప్..

  • Share this:
షూటింగ్స్ లేవు.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి అవకాశం లేదు.. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి.. కచ్చితంగా లాక్ డౌన్ అయిపోవాలంతే. రోజూ బయట తిరిగిన ప్రాణాలకు ఒక్కసారిగా ఇంట్లోనే ఉండాలంటే బోర్ కొట్టక తప్పదు. అందుకే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్లతో పాటు యాంకర్స్ రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్, ప్రదీప్ లాంటి వాళ్లంతా ఒకే పనితో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ గరిట పట్టని వాళ్లు కూడా హాయిగా వంటలు చేసుకుంటున్నారు. దాంతో పాటే మరో పని కూడా చేస్తున్నారు వాళ్లంతా. కేవలం స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా అంతా మంచి స్నేహితులు.

సుడిగాలి సుధీర్ 3 మంకీస్ ఫోటో
సుడిగాలి సుధీర్ 3 మంకీస్ ఫోటో


దాంతో ఇప్పుడు లాక్ డౌన్ పీరియడ్ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. పొద్దున్నే లేచినప్పట్నుంచి తమ రచ్చ మొదలు పెడుతున్నారు. బయటికి కూడా వెళ్లేదే లేదు కదా మరెక్కడ రచ్చ అనుకుంటున్నారా..? ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు వీడియో కాల్స్ కూడా బాగా వాడేసుకుంటున్నారు ఈ టీం అంతా. ఎవరెవరు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారనేది వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు. వాటిని తమ తమ యూ ట్యూబ్ ఛానెల్స్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా రష్మి గౌతమ్ ప్రస్తుతం కుక్కల పరిరక్షణలో బిజీగా ఉంది.

రష్మి గౌతమ్, అనసూయ (anasuya rashmi gautam)
రష్మి గౌతమ్, అనసూయ (anasuya rashmi gautam)


ఆమె ఆకలితో ఉన్న శునకాలకు ఆహారం పంచే పనిలో బిజీ అయిపోయింది. మరోవైపు ప్రదీప్, అనసూయ ఇంటి పనులతో బిజీ అయిపోయారు. దాంతో పాటు మిగిలిన వాళ్లు కూడా అంతా ఇంటి పనులు చేస్తున్నారు. కానీ ఏదో ఓ టైమ్‌లో అందరూ ఒకేచోటికి వచ్చి వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు. కాన్ఫరెన్స్ పెట్టుకుని కుశలం అడుగుతున్నారు.

సుధీర్ రష్మీ గౌతమ్, ప్రదీప్ (sudheer Rashmi, Pradeep)
సుధీర్ రష్మీ గౌతమ్, ప్రదీప్ (sudheer Rashmi, Pradeep)


నువ్వేం చేస్తున్నావ్ అంటే నువ్వేం చేస్తున్నావ్ అంటూ అడుగుతూ ఈ రోజు ఏం చేసారు అనేది కూడా చెబుతున్నారు. అంతా దూరం దూరంగా ఉన్నా కూడా ఆ ఫీల్ రాకుండా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మాట్లాడుకుంటున్నారు. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్లీ అంతా షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ కూడా ఈ వీడియో కాల్స్ చేసి అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: