Pradeep Machiraju: ప్రదీప్ కోసం అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి డాన్సులు..

ప్రదీప్, అమృత అయ్యర్ Photo : Youtube

Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరో అయిపోయాడు. కొన్నేళ్లుగా ఈయన చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ఆ తర్వాత స్టార్ యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

  • Share this:
యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరో అయిపోయాడు. కొన్నేళ్లుగా ఈయన చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ఆ తర్వాత స్టార్ యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా జనవరి 29న విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ఈయన తన సినిమా ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నాడు. అయితే తెలుగులో ఏ యాంకర్ హీరో అయినా.. హీరోయిన్ అయినా మిగిలిన వాళ్లు కూడా వచ్చి వాళ్లకు ప్రమోషన్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రదీప్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా నటించిన సినిమా కోసం అనసూయ, రష్మి గౌతమ్‌తో పాటు శ్రీముఖి కూడా వచ్చింది. ఈ ముగ్గురు కూడా ప్రదీప్‌కు చాలా కాలంగా స్నేహితులు. అందుకే ప్రదీప్ సినిమా కోసం ప్రమోషన్ చేయడానికి వచ్చారు. గతంలో యాంకర్ రవి హీరోగా నటించిన ఇది మా ప్రేమకథ సినిమా కోసం కూడా అనసూయ నుంచి అంతా వచ్చి సపోర్ట్ చేసారు. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. తాజాగా వాహ్ బావా.. అంటూ సాగే ఓ మాస్ బీట్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అదిరిపోయే సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో పాట కూడా వచ్చేసింది. ఈ ట్యూన్ అయితే వినగానే డాన్సులు చేయాలనిపించేలా ఉంది.

అందులోనే అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి వచ్చారు. ముగ్గురు కూడా మూడు రకాల స్టెప్పులతో అదరహో అనిపించారు. గతంలో శ్రీముఖితోనే ప్రదీప్ కెరీర్ మొదలైంది. ఈ ఇద్దరూ కలిసి ఒకేసారి బుల్లితెరకు వచ్చారు. ఆ తర్వాత అనసూయ, రష్మి గౌతమ్‌తో స్టేజ్ షేర్ చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కచ్చితంగా ఈ సినిమాతో హీరోగా నిలబడతానని చెప్తున్నాడు ప్రదీప్ మాచిరాజు.
Published by:Praveen Kumar Vadla
First published: