హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న జబర్దస్త్ యాంకర్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరు మున్నీరవుతున్న జబర్దస్త్ యాంకర్..

యాంకర్ అనసూయ తండ్రి కన్నుమూత (anasuya bharadwaj)

యాంకర్ అనసూయ తండ్రి కన్నుమూత (anasuya bharadwaj)

Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్, ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరైపోయింది అనసూయ.

ఇంకా చదవండి ...

జబర్దస్త్ యాంకర్, ప్రముఖ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసి కన్నీరు మున్నీరైపోయింది అనసూయ. హైదరాబాద్ తార్నాకలో అనసూయ పేరెంట్స్ ఉంటారు. అక్కడే కొన్నేళ్లుగా ఉంటున్నారు వాళ్లు. సుదర్శన్ రావు తన సొంత నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5 ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనైన అనసూయ తండ్రి.. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీలోని ప్రముఖులు అనసూయకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. తమ సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సుదర్శన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు.

అలాగే సమాజసేవలోనూ ఆయన ముందుండేవారు. తండ్రి మరణంతో యాంకర్ అనసూయ తీవ్రం విషాదంలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసినప్పటి నుంచి కన్నీరు పెడుతూనే ఉంది ఈమె. పలువురు జబర్దస్త్ నటులతో పాటు సినీ ప్రముఖులు కూడా అనసూయ భరద్వాజ్ ఇంటికి చేరుకుంటున్నారు. నాగబాబు, రోజా కూడా అనసూయకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. వాళ్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు