Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI RESPONDS ON RAPES ON WOMEN AND SAYS THERE ARE TONS OF OTHER WAYS TO CONQUER A WOMEN NOT THE RAPE SR

అమ్మాయిలను గెలవడం అంటే రేప్ చేయడం కాదు..జబర్దస్త్ రష్మీ సంచలన వ్యాఖ్యలు

రష్మీ గౌతమ్ Photo: Instagram

రష్మీ గౌతమ్ Photo: Instagram

యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది. ముఖ్యంగా తన ట్విటర్‌లో సినిమాలకు సంబందించిన వార్తల కన్నా సమాజం గురించి, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అందులో భాగంగా..అమ్మాయిలపై జరుగుతున్న రేప్‌లపై స్పందించింది.

ఇంకా చదవండి ...
    జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది. ముఖ్యంగా తన ట్విటర్‌లో సినిమాలకు సంబందించిన వార్తల కన్నా సమాజం గురించి, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమె ముఖ్యంగా మహిళ సాధికారత మొదలగు విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా.. ఆమె తాజగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, రేప్‌లు గురించి మాట్లాడింది. రేప్‌లు అమ్మాయిల్నీ, వారి జీవితంలో ఎలా కుంగదీస్తాయో తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది. అమ్మాయిలపై రేప్‌లకు కారణం వారు వేసుకుంటున్న మినీ స్కట్స్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రష్మీ సీరియస్ అవుతూ.. రేప్ అనే పదం ప్యాన్సీ వర్డ్ కాదు.. దాన్ని జోక్‌గా వాడడం ఎంటని ప్రశ్నించింది. అమ్మాయిలను రేప్ చేసి..గెలిచినట్లు అని అనుకోవద్దు. వారిని గెలవడానకిి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాని రేప్ మార్గం కాదు అనే అర్ధం వచ్చే లాగా ఓ పోస్ట్ చేసింది. రేప్ అనుభవించిన వారికి తెలుసు..దాని భాద.. ఆ క్షోభ. వారి భాదను మాటల్లో చెప్పలేం అని పేర్కోంది.

    రష్మీ గౌతమ్ Photo: Instagram


    కేవలం అమ్మాయిలు మినీ స్కర్ట్‌లు వేసుకోవడం వలనో, లేదా సరిగా దుస్తులు ధరించకపోవడం వలనో రేప్‌లు జరగట్లేదని..ఈ మినీ స్కర్ట్‌లు, మోడ్రన్ డ్రెస్‌లు రాకముందు నుండే రేప్‌లు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అంటూ పేర్కోంది. అంతేకాకుండా..ఓ ఇమేజ్‌ను కూడా పోస్ట్ చేసింది.. రేప్ అనేది ముందే వచ్చిందనే దాని సారాంశం. అమ్మాయిలపై జరుగుతున్న రేప్‌లపై రష్మీ ఈ విధంగా స్పందించడంపై పలువురు నెటిజన్లు ప్రశంస్తుండగా..మరికొంతమంది  విమర్శిస్తున్నవారు ఉన్నారు.

    First published:

    Tags: Jabardasth comedy show, Nagababu, RAPE, Rashmi Gautam, Telugu Cinema News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు