యాంకర్ ప్రదీప్‌తో రష్మి గౌతమ్ పెళ్లంట.. సుడిగాలి సుధీర్ పరిస్థితేంటి..?

Rashmi Gautham: రష్మి పెళ్లి గురించి కూడా ఓ వార్త బయటికి వచ్చింది. ఈమె ఓ టాప్ యాంకర్‌ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు బాగానే జోరుగా వినిపిస్తున్నాయిప్పుడు. ఆ యాంకర్ మరెవరో కాదు.. ప్రదీప్ మాచిరాజు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2020, 8:57 PM IST
యాంకర్ ప్రదీప్‌తో రష్మి గౌతమ్ పెళ్లంట.. సుడిగాలి సుధీర్ పరిస్థితేంటి..?
రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)
  • Share this:
ఎప్పటికప్పుడు జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఒడిసాలో 100 ఎకరాల భూమి కొనేసిందని వార్తలు వస్తున్నాయి. అక్కడే వ్యవసాయం చేస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. రష్మి పెళ్లి గురించి కూడా ఓ వార్త బయటికి వచ్చింది. ఈమె ఓ టాప్ యాంకర్‌ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు బాగానే జోరుగా వినిపిస్తున్నాయిప్పుడు. ఆ యాంకర్ మరెవరో కాదు.. ప్రదీప్ మాచిరాజు. తెలుగులో యాంకర్‌గానే కాదు ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ప్రదీప్. ఈయన ఢీ ఛాంపియన్స్ షోకు హోస్ట్ కూడా. ఇదే షోలో రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ కూడా ఉంటారు.

రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)
రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)


ఈ జోడీకి అదిరిపోయే క్రేజ్ ఉంది. సుధీర్, రష్మి జోడీ కంటే కూడా వీళ్లతో ప్రదీప్ కలిస్తే వచ్చే అల్లరి మరో స్థాయిలో ఉంటుంది. ఈ ముగ్గురు ఒకేచోట కలిసారంటే నవ్వులు ఆపడం ఎవరి తరం కాదు. అంతగా నవ్వించేస్తారు. ఈ షోతో పాటు జబర్దస్త్ కూడా కలిసి చేస్తున్నారు కాబట్టే సుధీర్, రష్మి మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వస్తుంటాయి. ఇవి అబద్ధమని ఎప్పటికప్పుడు వాళ్లు క్లారిటీ ఇస్తుంటారు. ఇప్పుడు దాన్ని మించిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యాంకర్ రష్మి గౌతమ్ త్వరలోనే ప్రదీప్ మాచిరాజును పెళ్లి చేసుకోబోతుందని ఈ వార్త సారాంశం.

సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్ (Pradeep Rashmi Marriage)
సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్ (Pradeep Rashmi Marriage)
నిజానికి ఢీ షోలో సుధీర్ కాకుండా ప్రదీప్‌తో కూడా రష్మి కెమిస్ట్రీ అదిరిపోతుంది. ఈ ఇద్దరూ కలిసి సుధీర్‌ను ఉడికించే సన్నివేశం అదుర్స్ అనిపిస్తుంది. దాంతో పాటే ఈ జోడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రదీప్‌తో రష్మి గౌతమ్ పెళ్లి జరగబోతుందనే ప్రచారం బాగానే జరుగుతుంది. ఈ ఇద్దరూ 2020 సమ్మర్‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇది చూసిన తర్వాత 2020కి బెస్ట్ జోక్ ఇదే అంటూ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు భయ్యో అంటూ మరికొందరు కూడా కమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రష్మి, ప్రదీప్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలపై వాళ్లిద్దరే స్పందించాలి మరి. లేదంటే మౌనం అర్ధాంగీకారం అంటూ మరిన్ని వార్తలు వచ్చినా వస్తాయి.
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు