పుట్టినరోజున రష్మీ గౌతమ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవైపు ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు హీరోయిన్గా సినిమాలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లో మరింత చురగ్గా పాల్గొనాలని డిసైడ్ అయినట్టు రష్మీ గౌతమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రష్మీ గౌతమ్..సమాజంలో జరిగే ఇష్యూష్పై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంది. ఆ మధ్య పుల్వామా ఎటాక్‌లో భారత వీర జవాన్లు అమరులైతే ఈ రకంగానే స్పందించింది.ఎప్పటికప్పుడు అభిమానులతో మాట్లాడటం.. వాళ్లతో అన్ని విషయాలు పంచుకోవడం ఈ భామకు ముందు నుంచి కూడా ఉన్న అలవాటు. ప్రతీ విషయాన్ని పబ్లిక్‌గానే ఉంచడానికి ఇష్టపడుతుంది రష్మి. ఒక వైపు జబర్థస్త్ యాంకర్‌గా ఉంటూనే మధ్యలో సినిమాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకే యూత్‌లో రష్మీ గౌతమ్‌కు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
ఆ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘గుంటూరు టాకీస్’లో రష్మీ గౌతమ్ ఓ రేంజ్లో అందాలను ఆరబోసి యూత్ మనసులు దోచుకుంది. ఆ తర్వాత ‘నెక్ట్స్ నువ్వే’ వంటి కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమె దృష్టి మాత్రం జబర్థస్త్ ప్రోగ్రామ్ పైనే. ఈ మధ్యనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన రష్మీ గౌతమ్..సడెన్ ఇపుడు తన దృష్టిని సినిమాలపై మళ్లించినట్టు రష్మీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు రష్మీ ని దృష్టిలో ఉంచుకొని కొన్నిలేడీ ఓరియంటెడ్ కథలను రెడీ చేస్తున్నట్టు సమాచారం.
ఇందులో టాలీవుడ్‌కు చెందిన అగ్రశ్రేణికి దర్శకులు కూడా ఉండటం విశేషం. ఒకవైపు జబర్థస్త్ ప్రోగ్రాంలో నటిస్తూనే సినిమాలు చేయాలని రష్మీ గౌతమ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకవైపు జబర్ధస్త్, ఇంకోవైపు సినిమాలు..ఇది చాలదన్నట్టు రష్మీ గౌతమ్‌ను బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం.ఒకవేళ బిగ్‌బాస్ 3లో రష్మీ ఎంట్రీ ఇస్తే.. ఎక్స్ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్ యాంకరింగ్‌కు కొన్ని రోజులు హోస్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఆల్రెడీ ఎక్స్ట్రా జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ..నిజంగానే బిగ్‌బాస్ 3కి ఓకే చెెబుతుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి పుట్టినరోజున రష్మీ తీసుకోబోయే నిర్ణయం పై ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Jabardasth comedy show, Janasena party, MLA Roja, Nagababu, Narsapuram S01p09, Pawan kalyan, Rashmi Gautam, Telugu Cinema, Tollywood, Ys jagan mohan reddy, Ysrcp