హోమ్ /వార్తలు /సినిమా /

Rashmi Gautham: ప్లీజ్.. కనీసం ఒక్క రూపాయి అయినా ఇవ్వండి అంటున్న రష్మి.. అభ్యర్థన ఎందుకో తెలుసా..?

Rashmi Gautham: ప్లీజ్.. కనీసం ఒక్క రూపాయి అయినా ఇవ్వండి అంటున్న రష్మి.. అభ్యర్థన ఎందుకో తెలుసా..?

ఒక్క రూపాయి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కు రష్మిఅభ్యర్థన

ఒక్క రూపాయి ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కు రష్మిఅభ్యర్థన

రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ పెడుతూ.. అభిమానుల్లో ఉండే క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటోంది. తాజాగా ఆమె ఒక్క రూపాయి అయినా హెల్ప్ చేయండి ప్లీజ్ అంటూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకర్ గా తొలిసారి అడుగుపెట్టి.. అనతి కాలంలో తెలుగులో టాప్ యాంకర్ల జాబితాలో చేరింది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.. కానీ స్టార్ హీరోయిన్ కి ఉండే క్రేజ్ ను సొంతం చేసుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా టీమ్ లీడర్ గా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటోంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చి ఎక్కిస్తూ ఉంటుంది. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఏ ఫోటో పెట్టినా క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. ఆమె పెట్టిన వెంటనే ఫోటోలను చూసిన అభిమానులు తెగ లైక్స్ కొడుతూ తన అందాన్ని పొగుడుతూ ఉంటారు. అయితే కేవలం ఆమె తన సోషల్ మీడియాను గ్లామర్ షోకి మాత్రమే వాడుకోవడం లేదు. అప్పుడప్పుడూ తన ఫోటోల షేర్ల తోనే కాకుండా సమాజం పట్ల కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తోంది. తనలోని ఓ మానవత్వం ఉన మహిళ ఉందని చాటి చెబుతూ ఉంటోంది. తాజాగా కనీసం ఒక్క రూపాయి అయినా ఇవ్వండి ప్లీజ్ అంటూ రష్మి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది..

సాధరణంగా మూగజీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే రష్మి చలించిపోతుంది. ఎక్కడ.. ఏ జంతువుకి హాని జరిగినా వెంటనే స్పందిస్తుంది. ఇటీవల ఇషాన్‌ అనే కుక్క గాయపడగా దాన్ని చూసి కలత చెందిన ఆమె, చికిత్స కోసం దానం చేయండంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానుల్ని అభ్యర్థించింది. ఆమె నేరుగా వీడియోలోకి వచ్చి అభ్యర్థించడంతో అభిమానులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ సాయం చేస్తున్నారు. అండగా మేం ఉంటమంటూ ముందుకు వస్తున్నారు.

నెల క్రితం ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఇషాన్‌ అనే కుక్క ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి దాని చికిత్సకు రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతుంది. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. తన వంతు సాయం చేస్తున్నానని. మీరంతా కూడా సాయం చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్‌ మీకు తోచినంత సాయం చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అనుసరిస్తున్న వారు 37,7800 మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అందరం కలిసి సాయం చేద్దాం అని కోరింది. డొనేట్‌ చేసే లింక్‌ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. చికిత్స పూర్తయిన తర్వాత ఇషాన్‌ని అలా వదిలేయకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.http://జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ ఆపరేషన్‌ చేసి, వాటిని అలాగే వదిలేస్తున్నారని, దీనికి పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ని ఇటీవల ట్విటర్‌ వేదికగా ఆమె కోరింది.

First published:

Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Instagram, Jabardasth rashmi

ఉత్తమ కథలు