Rashmi Gautam: రష్మి గౌతమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. వరుడు అతడేనా..

Rashmi Gautam | తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్..త్వరలో పెళ్లి చేసుకునుందా. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 22, 2020, 6:46 AM IST
Rashmi Gautam: రష్మి గౌతమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. వరుడు అతడేనా..
రష్మి గౌతమ్ (Twitter/Photo)
  • Share this:
Rashmi Gautam | తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్..త్వరలో పెళ్లి చేసుకునుందా. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అందులో ‘గుంటూరు టాకీస్‌’ మినహా మరే చిత్రము పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లినట్టు చెబుతున్నారు. అంతేకాదు తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

rashmi gautam latest pics,rashmi gautam,rashmi gautam movies,rashmi,jabardasth rashmi,rashmi gautam age,anchor rashmi gautam,rashmi gautham,anchor rashmi,rashmi gautam real life,rashmi gautam interview,rashmi gautam biography,rashmi gautam exclusive interview,జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ పిక్స్
రష్మి గౌతమ్ Instagram


ఇక జబర్ధస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ విషయానికొస్తే.. .. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుకు తల్లైన ఇప్పటికే వరుస షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. మ్యారేజ్ తర్వాత తన కెరీర్‌ను కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలామాలో ఉండే. కానీ సుమ, అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను సాఫీగానే కొనసాగిస్తున్నారు. అలాగే తాను కూడా మ్యారేజ్ చేసుకొని యాంకర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్మి గౌతమ్‌ తనకు కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అతనురష్మి గౌతమ్ చెప్పిన అన్ని షరుతులకు ఒప్పుకున్నట్టు సమాచారం. త్వరలోనే రష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో  నటిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 22, 2020, 6:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading