పవన్ కళ్యాణ్ పరువు తీయకు.. రష్మి గౌతమ్ వార్నింగ్..

Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షో మాత్రమే కాదు.. బయట కూడా చాలా యాక్టివ్‌గానే ఉంటుంది రష్మి గౌతమ్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఈమె వాడుకుంటున్నట్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 28, 2020, 4:43 PM IST
పవన్ కళ్యాణ్ పరువు తీయకు.. రష్మి గౌతమ్ వార్నింగ్..
రష్మి గౌతమ్ పవన్ కళ్యాణ్ (rashmi gautam pawan kalyan)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో మాత్రమే కాదు.. బయట కూడా చాలా యాక్టివ్‌గానే ఉంటుంది రష్మి గౌతమ్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఈమె వాడుకుంటున్నట్లు మరే యాంకర్ కూడా వాడుకోలేదేమో..? దగ్గినా తుమ్మినా కూడా ఇదిగో నేనిప్పుడే ఇదే చేసానంటూ పోస్ట్ పెడుతుంటుంది రష్మి గౌతమ్. దాంతో పాటు సామాజిక బాధ్యతతో కూడిన పోస్టులు కూడా పెడుతుంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఇప్పుడు కూడా ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టింది. కరోనా వైరస్‌పై రోజూ ఏదో ఓ పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ మధ్యే ఒకటి అలా పెట్టింది.

కరోనా కారణంగా చాలా మంది ఆకలితో చచ్చిపోతున్నారు.. రోజూవారీ కూలీలతో పాటు బిక్షగాళ్లు కూడా అన్నం కోసం అలమటిస్తున్నారు.. దయచేసి అలాంటి వాళ్ళకు మీరు తోచిన సాయం చేయండి.. మీరు తినే అన్నంలో కాస్త వాళ్లకు కూడా సాయం చేస్తే అంతకంటే మరో మంచిపని ఇంకోటి ఉండదు అంటూ పోస్ట్ చేసింది రష్మి గౌతమ్. దీనిపై చాలా మంది ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఒక్కరు మాత్రం విమర్శలు చేసాడు. ముందు నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టడం మానేసి.. నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లకు పోయి సాయం చేయ్ అంటూ ఘాటుగానే కామెంట్ పెట్టాడు. అది చూసిన రష్మికి ఒళ్ళు మండిపోయింది.


వెంటనే అతడికి రిప్లై ఇచ్చింది. నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి.. కనీసం నువ్వు పెట్టుకున్న పేరుకు అయినా వ్యాల్యూ ఇవ్వు.. ఆ పేరు పరువు తీయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తి పేరు కళ్యాణ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ అభిమాని. దాంతో పవన్ పేరుకు చాలా విలువ ఉంది.. దాన్ని ఇలాంటి చీప్ కామెంట్స్ పెట్టి తీయొద్దని గట్టిగానే చెప్పింది రష్మి. దీనికి కూడా చాలా మంది కామెంట్స్ ఇచ్చారు. కొందరు అయితే పవన్ కళ్యాణ్ పేరు తీసేసి మీ యిష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టుకోండి.. అంతేకానీ మీరు చేసే ఎదవ పనుల్లో ఆయన పేరును మాత్రం వాడకండి అంటూ పోస్ట్ చేసారు. రష్మి గౌతమ్ కూడా ఇదే చెప్పింది.
First published: March 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading