JABARDASTH ANCHOR RASHMI GAUTAM TAKEN CLASS TO THIS GENERATION AND SAYS WE LOST HUMANITY PK
రష్మి గౌతమ్ సీరియస్.. కాస్త మనుషుల్లా బిహేవ్ చేయండి..
రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)
Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌కు మనుషుల కంటే కూడా మూగ జీవాలపైనే ఎక్కువగా ప్రేమ ఉంది. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వేలాది మూగ జీవాల..
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్‌కు మనుషుల కంటే కూడా మూగ జీవాలపైనే ఎక్కువగా ప్రేమ ఉంది. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వేలాది మూగ జీవాల ఆలన పాలన చూసుకుంటుంది రష్మి. వాటి ఆకలి తీరుస్తుంది.. తన జంతు ప్రేమతో అందరి ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పుడప్పుడూ ఈమెకు కోపం తెప్పించే పనులు కూడా కొందరు చేస్తున్నారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విధానం.. కుక్కలపై చేస్తున్న అరాచకాల వీడియోలు రష్మి గౌతమ్‌కు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాటిని చూసి చలించిపోయింది రష్మీ గౌతమ్.
రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)
ఆ మధ్య ఓ అమ్మాయి అసలు మనిషిగా బతకాలంటేనే సిగ్గు అనిపిస్తుంది అంటూ కుక్కలపై పాకిస్తాన్లో చేస్తున్న పాశవిక దాడిని రష్మికి ట్యాగ్ చేసింది. ఈ వీడియోలో కుక్కను దారుణంగా హింసిస్తున్నారు అక్కడ. దాంతో ఇది చూసి మనుషిగా బతకడానికి సిగ్గేస్తుందంటూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది రష్మి గౌతమ్. దాంతో పాటు ఏనుగు మృతిపై కూడా స్పందించింది రష్మి. అసలు మనుషులకు విలువలు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి.. అక్కడే తొలి పాఠాలు నేర్పించాలి.. ఎలా బతకాలి.. ఎలా ఉండాలి అనేది అన్నీ ఇంటి నుంచే మొదలవ్వాలి.
రష్మి గౌతమ్ Instagram/rashmigautam
కనీసం ఓ రాయి తీసుకుని కొట్టాలనే ఆలోచన కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబానిదే. కానీ ఇప్పటి తరం అది మరిచిపోతుంది.. అలాంటి విలువలను గాలికి వదిలేసింది.. అందుకే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మూగ జీవాలను ప్రేమించలేకపోవడం నిజంగానే ఓ రోగం అంటుంది రష్మి గౌతమ్. ఈమె పోస్టుకు కొందరు సపోర్ట్ చేస్తున్నారు.. మరికొందరు మాత్రం కరుస్తున్నపుడు ఇలాంటివి తప్పవంటూ పోస్టులు పెడుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.