Home /News /movies /

JABARDASTH ANCHOR RASHMI GAUTAM STRONG COUNTER AGAINST ONE OF THE BLACKMAIL NETIZEN TA

జబర్ధస్త్ యాంకర్ రష్మీకి బెదిరింపులు.. రాసలీలలు బయట పెడతానంటూ వార్నింగ్..

రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్

కెరీర్ తొలినాళ్లలో బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. అక్కడ అంతగా కలిసిరాకపోవడంతో  జబర్దస్త్ అంటూ స్మాల్ స్క్రీన్‌వైపు అడుగులేసింది. ఇక్కడ తనదైన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ యూత్‌లో ఆమెకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ రాసలీలలు బయటపెడతానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ...
కెరీర్ తొలినాళ్లలో బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. అక్కడ అంతగా కలిసిరాకపోవడంతో  జబర్దస్త్ అంటూ స్మాల్ స్క్రీన్‌వైపు అడుగులేసింది. ఇక్కడ తనదైన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ యూత్‌లో ఆమెకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌ట్రా జబర్థస్త్ యాంకర్‌గా ఉంటూనే సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందించడం రష్మీ గౌతమ్ ప్రత్యేకత. ఒకవైపు ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇంకోవైపు షాప్ ఓపెనింగులతో ఈ భామ ఫుల్ బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ భామకు ఒక నెటిజన్ నుండి  ఒక రకమైన బెదిరింపులు రావడం సినీ,టీవీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు సదరు నెటిజన్..రష్మీ గౌతమ్ రాసలీలలను బయటపెడతానంటూ షాకింగ్ పోస్ట్ చేసాడు. దీంతో సదరు నెటిజన్‌కు రష్మీ అభిమానులు వద్దు వద్దు అంటూ ఆ పోస్ట్‌ను డిలీట్ చేయమంటూ రిక్వెస్ట్ చేసారు. ఇక నెటిజన్‌ చేసిన కామెంట్స్‌పై రష్మీ గౌతమ్ సీరియస్‌గా స్పందించింది. నీ దగ్గర నాకు సంబంధించిన వీడియోలు ఏ ముంటే అవి పెట్టేయ్.. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి వాటిని స్వాగతిస్తున్నా అంటూ సదరు నెటిజన్‌కు గట్టిగానే ఇచ్చుకుంది. మరి ఈ ఇష్యూ ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
First published:

Tags: Anasuya Bharadwaj, Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Jabardasth comedy show, MLA Roja, Nagababu, Rashmi Gautam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు