అవునా.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? రేటింగ్ వస్తే ఎమైనా చేసుకోండి.. ఎలా అయినా వాడుకోండి అంటూ అనుమతులు వచ్చినపుడు అక్కడ రైటర్స్ మాత్రం రెచ్చిపోకుండా ఎందుకుంటారు..? రష్మి గౌతమ్, అనసూయ లాంటి అందమైన యాంకర్స్‌ను టార్గెట్ చేయకుండా ఎందుకుంటారు చెప్పండి..? ఇప్పుడు కూడా ఇదే జరిగింది. జబర్దస్త్ కమెడియన్స్ చాలా మంది రష్మిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఆమె వయసుపై అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తుంటారు. రష్మితో ఎంతమంది ఆడుకున్నా కూడా సుధీర్ వచ్చాడంటే మాత్రం రొమాన్స్ మొదలవుతుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని రొమాన్స్ ఈ ఇద్దరి సొంతం. అలాంటి రొమాన్స్ ఇప్పుడు మరో కమెడియన్ కూడా చేస్తున్నాడు. జబర్దస్త్‌లో కొన్ని రోజులుగా సపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ ఇమ్మాన్యుయేల్. ఈయన దూకుడు చూస్తుంటే త్వరలోనే టీమ్ లీడర్ కూడా అయ్యేలా కనిపిస్తున్నాడు. కెవ్వు కార్తిక్ టీంలో రెగ్యులర్ మెంబర్ అయిపోయాడు ఇమ్ము. ఆయనతో పాటు వర్ష కూడా ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో మాయ చేస్తుంది. ఈ అమ్మాయి గ్లామర్‌తో సోషల్ మీడియా కూడా వేడెక్కిపోయింది.
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది వర్ష. ఇదిలా ఉంటే ఈమె ఇమ్మాన్యుయేల్‌కు భలే కనెక్ట్ అయిపోయింది. ఈ ఇద్దరి జోడీ కలర్ ఫోటో సినిమా హీరో హీరోయిన్స్‌లా ఉంటారు. కలర్‌తో సంబంధం లేకుండా ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ మెంటల్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు కూడా ఓ స్కిట్‌లో భాగంగా వర్షతో రొమాన్స్ చేసాడు ఇమ్మాన్యుయేల్. కెవ్వు కార్తిక్ స్కిట్‌లో భాగంగా వర్షను పడేయడానికి వచ్చే ప్యూన్‌లా ఇమ్ము కనిపించాడు. అమ్మాయిని పటాయించడానికి కళ్లు లేని వాడిగా నటిస్తాడు. స్కిట్ జరుగుతున్న సమయంలో వర్షతో పాటు రష్మిని కూడా ఫ్లర్ట్ చేసాడు ఇమ్మాన్యుయేల్.
నీకు కళ్లు కనిపించవు కదా.. ఇక్కడ్నుంచి పది అడుగులు వేస్తే అంటే వెంటనే రష్మి గౌతమ్ వస్తుంది అంటాడు ఇమ్మాన్యుయేల్. అంతేకాదు ఇద్దరిదీ ఒకే కలర్ అంటూ రష్మి కలర్‌పై కూడా సెటైర్ వేసాడు. అక్కడితో ఆగకుండా అలా రష్మి వైపు వెళ్లాడు ఇమ్మాన్యుయేల్. అతడు అక్కడ వస్తుండగానే కాలికి ఉన్న చెప్పు తీసి వార్నింగ్ ఇచ్చింది రష్మి. దాంతో అట్నుంచటే పరార్ అయిపోయాడు ఇమ్మాన్యుయేల్. ఇదంతా స్కిట్‌లో భాగంగానే జరిగినా కూడా సోషల్ మీడియాలో ఈ క్లిప్ మాత్రం వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్‌కు చెప్పు చూపించిన రష్మి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రేటింగ్స్ వస్తున్నపుడు ఏం చేసినా పర్లేదంతే అనేది కొన్ని షోస్ పాలసీ. అందులో జబర్దస్త్ కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.