జబర్దస్త్ యాంకర్‌గానే అందరికీ పరిచయమైన ఈ బ్యూటీలో మరో కోణం కూడా ఉంది. సామాజిక బాధ్యత కూడా బాగానే చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా కూడా ముందుండి నడిపిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియా వేదికగా అన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది రష్మి. మొన్న లాక్ డౌన్ సందర్భంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వెళ్లి స్పందించండి.. సాయం చేయండి.. ఈ టైమ్‌లో కూడా సాయం చేయకపోతే మనం మనుషులమే కాదంటూ తనకు తోచిన సాయం చేసింది ఈమె. అక్కడితో ఆగడం లేదు.. జంతువుల గురించి రష్మి తీసుకుంటున్న జాగ్రత్తలు.. వాటి కోసం ఈమె పడుతున్న శ్రమను చూసి అంతా ఫిదా అయిపోయారు. మనుషులు కాబట్టి మన ఆకలితో పాటు అన్నీఎలాగోలా చెప్పుకుంటాం.. కానీ జంతువులు అలా కాదు కదా అంటుంది. లాక్ డౌన్ సమయంలో వాటికి కూడా తిండి చాలా కష్టం అయిపోతుంది.. కాబట్టి వాటి ఆకలిని తీర్చే బాధ్యత కొంతవరకు నేను తీసుకుంటున్నాను అంటూ చాలా వరకు మూగజీవాల కడుపులు నింపింది రష్మి. అందుకే కుక్కలతో పాటు పిల్లులు ఇలా వీధిలో ఉండే జంతువులకు ఫుడ్ సప్లై చేసింది రష్మి గౌతమ్.
వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంది. తెలుగు ఇండస్ట్రీలో జంతువుల ప్రేమ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు అమల అక్కినేని. ఈమె జంతు పరిరక్షణ కోసం కొన్నేళ్లుగా పాటు పడుతూనే ఉంది. ఇప్పుడు ఈమె స్థానంలోకి రష్మి గౌతమ్ వచ్చేలా కనిపిస్తుంది. ఆమె మాదిరే అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మూగ జీవాలను ప్రేమించడం నేర్చుకోండి.. మనుషులు అనిపించుకోండి అంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. అంతేకాదు ఇప్పుడు మరో పోస్ట్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కుక్క ఫోటోను పోస్ట్ చేసింది రష్మి. అందులో కుక్కలను దూరం పెట్టకండి.. వాటిలో చెడ్డ కుక్కలు ఉండవు.. అవి కూడా మన కుటుంబమే అనే సంగతి గుర్తుంచుకోండి.. మీరు కుక్కలను ఇంట్లోకి ఆహ్వానించకపోయినా పర్లేదు.. కనీసం వాటిని కూడా మన కుటుంబమే అనే సంగతి మాత్రం గుర్తు పెట్టుకోండి అంటూ పోస్ట్ చేసింది రష్మి. దానికి ఓ కుక్క బొమ్మను జత చేసింది ఈ జబర్దస్త్ యాంకర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.